Pakistan Passenger Train Hijacked: పాకిస్తాన్‌లో ట్రైన్ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు
Pakistan Train Hijack:పాకిస్తాన్‌లో వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రైన్‌ను బలూచిస్తాన్ రెబల్స్ హైజాక్ చేశారు. డిమాండ్లు పరిష్కరించకుండా చర్యలు చేపడితే వాళ్లను చంపేస్తామని హెచ్చరిస్తున్నారు.

Pakistan Passenger Train Hijacked: పాకిస్థాన్ నుంచి బలూచిస్తాన్ వేరు చేయాలని పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ ట్రైన్‌ను హైజాక్ చేసింది. క్వెట్టా నుంచి 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసింది. పాకిస్తాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్ ఈ ట్రైన్ వెళ్తోంది. మొత్తం తొమ్మిది బోగీల్లో 400 మందికిపైగా ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారు. ట్రైన్ వెళ్తుండగా కాల్పులు జరిపి అటకాయించినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.
కాల్పులు ఘటన తెలిసిన కాసేపటికే బీఎల్‌ఏ ఓ ప్రకటన విడుదల చేసింది. జాఫర్ ట్రైన్‌ను తామే హైజాక్ చేశామని BLA ప్రతినిధి జీయంద్ బలోచ్ సంతకం చేసిన ప్రకటనలో తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించకుండా పాకిస్థాన్ ఎలాంటి ఆపరేషన్ చేపట్టినా బందీలను చంపేస్తామని స్టేట్మెంట్ ఇచ్చింది. తెలిపింది.
హైజాక్ ఇలా చేశారు
BLA ప్రతినిధులు ముందు ఆ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌ను పేల్చేశారు. ఇదే విషయాన్ని చెప్పి ట్రైన్‌ను ఆపేశారు. అనంతరం ట్రైన్‌లోకి గుంపులుగా ఎక్కి దారి మళ్లించినట్టు చెబుతున్నారు.
సైనిక చర్యలు వద్దని పాకిస్థాన్‌కు హెచ్చరిక
ఇలాంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఎలాంటి సైనిక చర్య చేపట్టొద్దని బీఎల్‌ఏ ప్రతినిధులు హెచ్చరించారు. ఇంకా వాళ్లు ఏమన్నారంటే..."ఏదైనా సైనిక చర్య తీసుకుంటే అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుంది. ఇప్పటివరకు ఆరుగురు సైనిక సిబ్బంది మృతి చెందారు. వందలాది మంది ప్రయాణికులు ఇంకా మా అదుపులో ఉన్నారు. ఈ ఆపరేషన్‌కు బలోచ్ లిబరేషన్ ఆర్మీ పూర్తి బాధ్యత తీసుకుంటుంది" అని BLA ప్రతినిధి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
బలూచిస్తాన్‌లో ఎమర్జెన్సీ
దీనికి రియాక్షన్ పాకిస్తాన్ నుంచి మొదలైనట్టు తెలుస్తోంది. బలూచిస్తాన్‌లోని బోలాన్ జిల్లాలోని ముష్కాఫ్ ప్రాంతానికి భద్రతా దళాలు చేరుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. బలూచిస్తాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్ని శాఖలకు సమాచారం ఇచ్చినట్టు ప్రభుత్వాధికారులు వివరించారు.
దశాబ్ధాల పోరాటం
బలూచిస్తాన్‌లో వేర్పాటువాదులకు భద్రతా దళాలకు పోరు సాగుతోంది. ఇప్పటికే వేల మంది చనిపోయారు. ఈ ప్రాంతంలో ఖనిజ సంపదను దోచుకునేందుకు చైనా ప్రయోజనాల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం పని చేస్తోందని తిరుగుబాటు దారులు ఆరోపిస్తూ ఆందోళన చేస్తుంటారు. బలూచిస్తాన్ గ్యాస్, ఖనిజ వనరులను అన్యాయంగా దోపిడీ చేస్తోందని ఆరోపిస్తుంటారు. చాలా గ్రూప్‌లు తమను వేరు చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు చేస్తున్నాయి. అలాంటిగ్రూపుల్లో BLA అతి పెద్దది.
పాకిస్తాన్‌లో అతి పెద్ద ప్రావిన్స్
పాకిస్తాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. ఇది పాకిస్తాన్‌లో 44 శాతం ఆక్రమించి ఉంది. ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ ఉన్న గ్వాదర్‌లోని ప్రపంచంలోని అతిపెద్ద లోతైన సముద్ర ఓడరేవు ఉంది. ఇది ప్రపంచ వాణిజ్య మార్గాలకు వ్యూహాత్మకంగా ఉంటుంది.
బలూచిస్తాన్, ఈశాన్యంలో ఖైబర్ పఖ్తుంఖ్వా, తూర్పున పంజాబ్, ఆగ్నేయంలో సింధ్ ప్రావిన్సులతో సరిహద్దులు కలిగిఉంది. దీనికి పశ్చిమాన ఇరాన్ ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. దక్షిణాన అరేబియా సముద్రం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

