Viral News:రూ. 200 అడిగిన ఆటో డ్రైవర్, రూ. వంద ఇస్తానన్న స్టూడెంట్- రూ. 120కి సెట్ చేసిన చాట్‌జీపీటీ! ఇదెక్కడి వాడకం బాసూ!
Viral News: ఓ వ్యక్తి తరఫున ఆటోవాలాతో బేరం మాట్లాడి సెట్ చేసిన చాట్‌జీపీటీ. బెంగళూరులో చేసిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ప్రతి చోట వినిపిస్తున్న పేరు చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్స్. ఆఫీస్‌లో పనుల నుంచి ఇంట్లో వంటల వరకు చాలా విషయంపై సమాధానాలు చెబుతూ ఆశ్చర్యపరుస్తోంది. ఏదైనా విజయం గురించి తెలియకపోతే ఒకప్పుడు గూగుల్‌ను అడిగే వాళ్లు ఇప్పుడు నేరుగా చాట్‌జీపీటిని అడుగుతున్నారు. అయితే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు ఓ బెంగళూరు వ్యక్తి.
బెంగళూరులో ఓ వ్యక్తి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ఆటో బుక్ చేసుకోవాలని అనుకున్నాడు. డ్రైవర్‌ను పిలిచి బేరం ఆడాడు. అక్కడకు వెళ్లేందుకు 200 రూపాయలు అవుతుందని చెప్పాడు. తను 100 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఎంతకీ బేరం తెగలేదు. అంతే ఆ వ్యక్తి చాట్‌జీపీటీని ఆశ్రయించాడు.
ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలి, ఆటో డ్రైవర్ ఎంత అడిగాడు. తాను ఎంతకు బేరమాడాడు. మొత్తం ఇంగ్లీష్‌లో బ్రీఫింగ్ ఇచ్చాడు. తర్వాత పద్ధతిగా ఆటో డ్రైవర్‌తో కన్నడలో మాట్లాడి బేరం చేయాలని చాట్‌జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చాడు. అంతే క్షణాల్లో ఆ పని చేసేసింది.
ఆటో డ్రైవర్‌తో మాట్లాడిన చాట్ జీపీటీ... ఆ వ్యక్తి విద్యార్థి అని, రోజూ ఆ రూట్‌లో వెళ్లే రెగ్యులర్ పాసింజర్ అని చెప్పింది. ఆటో ఫేర్ తగ్గించాలని రిక్వస్ట్‌గా చెప్పింది. అందుకే వీలు కాదని ఆటో డ్రైవర్ కన్నడలో చెప్పాడు. దానికి రిప్లై కూడా చాలా అందంగా ఇచ్చింది. ఇద్దరి మాట కాదని 120 ఫైనల్ చేసుకోమని కూడా రిక్వస్ట్ చేసింది.
Indians finding more use cases of ChatGPT 🤯
— Roads of Mumbai (@RoadsOfMumbai) April 28, 2025
pic.twitter.com/NZMSwoTdbm
మొత్తానికి ఆటో డ్రైవర్ కూడా 120కి ఓకే చెప్పాడు. ఈ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. చాట్‌జీపీటీ వాడకంలో ఇది ప్రో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వేరే ప్రాంతానికి వెళ్లిన తర్వాతా అక్కడి భాష రాకపోయినా సమస్య లేదని మరికొందరు అంటున్నారు. హ్యాపీగా మీకు నచ్చిన భాషలో మాట్లాడి ట్రాన్స్‌లేట్ చెప్పిమంటే సరిపోతుందని అంటున్నారు.
చాట్‌జీపీటీతో మీరు కూడా మాట్లాడొచ్చు
చాట్‌జీపీటీ ఇలాంటి సౌకర్యాన్ని మీరు కూడా పొందొచ్చు. చాట్‌జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత వాయిస్ కామెంట్‌పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అంశంపై చాట్‌జీపీటీతో ఏ భాషలోనైనా మాట్లాడవచ్చు. ఈ విధానంలో మీరు ఇతర భాషలను కూడా నేర్చుకోవచ్చు. ఇలా నేర్చుకునే క్రమంలో మీరు చేసిన తప్పులను సరి చేస్తుంది. ఆ లాంగ్వేజ్‌ను ఎలా పలకాలో కూడా వివరంగా చెబుతుంది. ఇంకెందుకు ఆలస్యంగా మీరు కూడా చాట్‌జీపీటీలోని ఈ టెక్నాలజీని విచ్చలవిడిగా వాడుకోండి.
OpenAI తన ప్రసిద్ధ డీప్ రీసెర్చ్ టూల్ లైట్ అండ్ ఫ్రీ వెర్షన్‌ను ఈ మధ్యే విడుదల చేసింది. దీనిని ఇప్పుడు అన్ని ChatGPT వినియోగదారులు, అది ఉచితం లేదా ప్లస్, టీమ్, ప్రో అయినా ఉపయోగించవచ్చు. ఈ తేలికైన వెర్షన్ o4-మినీ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది వినియోగదారులు యాక్సెస్ పొందగలిగే విధంగా రూపొందించారు.
డీప్ రీసెర్చ్ టూల్ అంటే ఏమిటి?
ఈ సంవత్సరం ప్రారంభంలో OpenAI డీప్ రీసెర్చ్ టూల్‌ను ప్రారంభించింది. ఈ టూర్ రీసెర్చ్ కోసం, సమాచారాన్ని సేకరించడానికి, దానిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత నివేదికలను సిద్ధం చేయడానికి రూపొందించారు. GPT-4o వేగవంతమైన సంభాషణ కోసం రూపొందిస్తే... డీప్ రీసెర్చ్ మరింత ఆలోచన, నిజమైన సమాచారం తనిఖీ చేసి ఇచ్చేందుకు క్రియేట్ చేశారు.
వినియోగదారులు ఏదైనా విషయం గురించిన అడిగినప్పుడు రీసెర్చ్ చేసి సమాచారాన్ని సేకరించి ఓ ఫార్మాట్ రూపంలో ఇస్తుంది. మొత్తం ప్రక్రియకు దాదాపు 5 నుంచి 30 నిమిషాల వరకు కొంత సమయం పడుతుంది, ఈ సమాచారాన్ని ఎక్కడ నుంచి తీసుకుంది, సోర్స్ ఏంటనే విషయాన్ని కూడా స్పష్టంగా చెబుతుంది.





















