Supreme Court: అమలులో లేని చట్టాలపై నిరసనలెందుకు? రైతులకు సుప్రీం ప్రశ్న
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా నిరసనలు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించింది.
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ జంతర్‌మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేసేందుకు అనుమతించాలని కోరుతూ కిసాన్ మహాపంచాయత్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత 'సత్యాగ్రహం' చేపట్టేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ రైతు సంఘాలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. వీటిని విచారణను చేపట్టిన జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 21న చేపడతామని పేర్కొంది.
లఖింపుర్ ఘటనపై..
ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనపై సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఎవ్వరూ బాధ్యత వహించరని కోర్టు అభిప్రాయపడింది.
40 సంఘాలకు నోటిసులు..
మరోవైపు దిల్లీ సరిహద్దుల వద్ద జాతీయ రహదారుల దిగ్బంధంపై వివరణ ఇవ్వాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ సహా 40 రైతు సంఘాల నేతలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. నిరసన విరమణ యత్నాలకు రాష్ట్ర ప్రభుత్వ కమిటీతో రైతులు చర్చల్లో పాల్గొనడం లేదని ఆరోపిస్తూ హరియాణా సర్కార్ దాఖలు చేసిన అఫిడవిట్‌పై జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
Supreme Court issues notice to 43 farmers' organisations on an application seeking to make them parties before the top court in a PIL against the blockade of roads between Delhi to Noida due to farmers' protests against the three agriculture laws pic.twitter.com/yVguADqLBb
— ANI (@ANI) October 4, 2021
Also Read: Aryan Khan Drug Case: అవును.. నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నాను: ఆర్యన్ ఖాన్