అన్వేషించండి

Uniform Civil Code: ఉత్తరాఖండ్‌లో అమల్లోకి UCC, ఈ కోడ్ తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా రికార్డు

Uniform Civil Code: ఉత్తరాఖండ్‌లో యునిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Uniform Civil Code in Uttarakhand: ఉత్తరాఖండ్ ప్రభుత్వం యునిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి తీసుకొచ్చింది. మార్చి 13వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. UCC అమలు  చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ చరిత్ర సృష్టించింది. గత నెలలో అసెంబ్లీలో ఈ బిల్ పాస్ అయింది. ఇప్పుడు ఆ బిల్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఫలితంగా ఇది చట్టరూపం దాల్చింది. ఫిబ్రవరి 7వ తేదీన వాయిస్ ఓట్ ద్వారా అసెంబ్లీలో పాస్ అయింది ఈ బిల్లు. దాదాపు రెండు రోజుల పాటు దీనిపై వాదోపవాదాలు జరిగాయి. అసెంబ్లీ సెలెక్ట్ కమిటీకి ఈ బిల్‌ని పంపించాలని, ఆ తరవాతే ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కానీ...పుష్కర్ సింగ్ ధామి సర్కార్ నేరుగా ప్రవేశపెట్టింది. 

ఈ చట్టం ప్రకారం లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్లు కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్లు రాష్ట్రంలో ఉన్నా వేరే ప్రాంతంలో ఉన్నా సరే ఉత్తరాఖండ్ వాళ్లయితే తప్పనిసరిగా ఈ నిబంధనను పాటించాలి. సహజీవనం చేసిన వాళ్లకి పుట్టిన పిల్లలను సక్రమ సంతానంగానే పరిగణిస్తారు. కొన్నాళ్లు సహజీవనం చేసి ఆ తరవాత మహిళను దూరం పెడితే కచ్చితంగా వాళ్లకు భరణం ఇవ్వాల్సి ఉంటుందని ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. లివిన్ రిలేషన్‌షిప్స్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే 6 నెలల జైలు శిక్ష విధించేలా కఠిన నిబంధన చేర్చారు. ఇక భర్త అత్యాచారం చేసినా, లేదంటే అసహజ శృంగారానికి పాల్పడాలని ఒత్తిడి తెచ్చినా, ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్నా విడాకులు ఇచ్చే హక్కులు భార్యకి కల్పించనుంది ఈ చట్టం. బహుభార్యత్వంతో పాటు హలాలా సంప్రదాయాన్నీ ఈ చట్టం నిషేధించనుంది. కొన్ని ముస్లిం వర్గాలు ఇప్పటికీ ఈ సంప్రదాయాల్ని పాటిస్తున్నాయి. దీని కారణంగా మహిళలకు అన్యాయం జరుగుతోందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భావించింది. అందుకే వాటిపై నిషేధం విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. అయితే...ఈ చట్టం గిరిజన వర్గాలకు మాత్రం వర్తించదని తెలిపింది. వాళ్ల ఆచారాలను, సంప్రదాయాలను కాదనే అధికారం లేదని వివరించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమలుకు ఇప్పటికే చర్చ జరుగుతోంది. గుజరాత్, అసోంలోనూ UCC అమలు చేసే అవకాశాలున్నాయి.

అసోం ప్ర‌భుత్వం రూపొందించిన  UCC బిల్లు.. తీవ్ర‌స్థాయిలో దుమారం రేపేలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ ముసాయిదా బిల్లుపై ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న చేస్తున్నా యి. కీల‌క‌మైన ముస్లిం మైనారిటీ వ‌ర్గాల వివాహాలు, విడాకుల రిజిస్ట్రేషన్‌ చట్టాన్ని రద్దు చేస్తున్నారు. దీంతో పాటు ఇత‌ర మైనారిటీ వ‌ర్గాల‌కు కూడా.. ఈ బిల్లులో షాక్ ఇచ్చే నిర్ణ‌యాలే ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ బిల్లును వ్య‌తిరేకిస్తూ.. అసోంలో మైనారిటీ వ‌ర్గాలు ఆందోళ‌న చేపడుతున్నాయి. ప్ర‌తిప‌క్షాలు కూడా.. ఈ బిల్లును వ్య‌తిరేకిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మి పార్టీలు, అసోం నేష‌న‌ల్ ఫ్రంట్ పార్టీ బిల్లును వ్య‌తిరేకిస్తున్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

El Nino Impact: విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
ABP Desam Top 10, 25 October 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 25 October 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
US Iran Tensions: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. ఒప్పందం కుదరకపోతే ఇవాళే దాడి తప్పదంటూ ట్రంప్ వార్నింగ్
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. ఒప్పందం కుదరకపోతే ఇవాళే దాడి తప్పదంటూ ట్రంప్ వార్నింగ్

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
El Nino Impact: విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
Bihar Politics: జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
కార్లలోనే కాదు.. టూవీలర్లలోనూ అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు! మీ బండిలో ఇవి ఉన్నాయా?
Crime Thriller OTT : నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
Embed widget