Your Weekly Horoscope April13th to April19th: ఈ వారం ఈ రాశులవారికి కొత్త ప్రారంభాలకు సంకేతం - శుభవార్త వినే సమయం!
Weekly Horoscope April 13 to April 19, 2025: ఈ వారం మీ అదృష్టం ఎలా ఉంది .. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

Your Weekly Horoscope: ఏప్రిల్ 13 నుంచి 19 వరకూ ఈ వారం మీ రాశిఫలాలు....
మేష రాశి (Aries Weekly Horoscope)
ఈ వారం మీకు అదృష్టం కలిసొచ్చేవారం. కెరీర్లో వృద్ధి ఉంటుంది. కొత్త ఎత్తులు వేయడానికి వాటిని చేరుకోవడానికి నూతన అవకాశాలు లభించవచ్చు. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఈ రాశివారు ఈ వారం గుడ్ న్యూస్ వింటారు. కొత్త వ్యాపార భాగస్వామ్యాల ద్వారా భవిష్యత్ లో లాభపడతారు. ఆరోగ్యం బావుంటుంది. బంధాలు బలపడతాయి.
వృషభ రాశి (Taurus Weekly Horoscope)
ఈ వారం మీ కుటుంబంలో మార్పులొస్తాయి.నూతన ఆస్తి నుంచి లాభపడతారు. ఇంటికి, కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. ఇల్లు మార్చడం కానీ నవీకరణం కానీ చేస్తారు. బంధువుల కారణంగా కొంత మానసిక గందరగోళం ఉండవచ్చు. ఈ వారం మీ తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమ సంబంధాలకు కుటుంబ అంగీకారం లభిస్తుంది.
మిథున రాశి (Gemini Weekly Horoscope)
ఈ వారం మిథున రాశివారికి ఆర్థిక జాగ్రత్త అవసరం . అవివాహితులకు వివాహయోగం ఉంది. ఈ వారం మీరు డబ్బుకు సంబంధించిన విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం. మానసిక సమతుల్యతను కాపాడుకోండి. అతిగా ఆలోచించడం మానేయండి.
కర్కాటక రాశి (Cancer Weekly Horoscope)
కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటుంది. ఆఫీసు లేదా వ్యాపారంలో టీంతో ఘర్షణ ఉండవచ్చు. కానీ మీ గత అనుభవాలు ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి సహాయపడతాయి. ముఖ్యమైన పనిలో విఫలం అయ్యే సంకేతం ఉంది, ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. తలనొప్పి, అలసట ఉంటుంది. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి.
సింహ రాశి (Leo Weekly Horoscope)
ఈ వారం మీ వైపు ఒక ప్రత్యేక వ్యక్తి ఆకర్షితులవుతారు. కొత్త ప్రేమ సంబంధం లేదా పాత సంబంధంలో కొత్తదనం ఉంటుంది. పని ప్రదేశంలో మంచి అవకాశాలు లభిస్తాయి కానీ విద్యార్థులకు శ్రద్ధ ఉండదు. గతాన్ని వదిలివేసి వర్తమానంలో జీవించడానికి ప్రయత్నించండి. నిద్రపోయేందుకు సమయం కేటాయించండి. భావోద్వేగాలపై నియంత్రణ ఉంచుకోండి.
కన్యా రాశి (Virgo Weekly Horoscope)
ఈ వారం మీ శ్రమ ఫలిస్తుంది. మీ ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితాలు లభించే సమయం వచ్చింది. పని ప్రదేశంలో మీ ఆచరణాత్మక ఆలోచన కృషి ఫలితాలను ఇస్తుంది. లవ్ లైఫ్ లో రొమాన్స్ పెరుగుతుంది కానీ అధిక భావోద్వేగాలను తగ్గించుకోండి. పొట్టకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు, ఆహారంపై శ్రద్ధ వహించండి. కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ అవకాశం ఉంది.
తులా రాశి (Libra Weekly Horoscope)
ఈ వారం తులా రాశివారికి జాగ్రత్త అసరం. పనిచేసే ప్రదేశంలో ఒత్తిడి పెరుగుతుంది. చేసే పనిపై ఆత్మపరిశీలన అవసరం. కార్యాలయంలో మీ పనితీరుపై విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఏదైనా పాత తప్పు ఈ వారం బయటపడే అవకాశం ఉంది. ఫలితంగా మానసిక అశాంతి పెరుగుతుంది. ఎవరి విషయంలోనూ మీ హద్దులు దాటొద్దు. బంధాల మధ్య దూరం ఏర్పడుతుంది జాగ్రత్త.
వృశ్చిక రాశి (Scorpio Weekly Horoscope)
వృశ్చిక రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మీ ప్రయత్నాల ఫలితం ఇప్పుడు బయటపడుతుంది. వ్యాపారులకు లాభం ఉంటుంది, ఉద్యోగులకు కొత్త బాధ్యతలు లభిస్తాయి. భవిష్యత్ లో మరింత బలంగా తయారవుతారు. ఆరోగ్యం బావుంటుంది. ప్రేమ సంబంధాలలో అవగాహన పెరుగుతుంది.
ధనుస్సు రాశి (Sagittarius Weekly Horoscope)
ఈ వారం మీకు మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పాత స్నేహితుడితో మాట్లాడటం వల్ల మనసు హాయిగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి కానీ కుటుంబ సమస్యలు చికాకుపెడతాయి. అలసటగా అనిపిస్తుంది..యోగా ద్వారా ఉపశమనం పొందడం అవసరం. జీవిత భాగస్వామితో సమన్వయం సాధించడం సవాలుగా ఉండవచ్చు.
మకర రాశి (Capricorn Weekly Horoscope)
మకర రాశివారికి ఈ వారం అభివృద్ధి ఉంటుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఈ వారం వేగంగా పూర్తవుతాయి. ఆఫీసులో కొత్త బాధ్యత లభించవచ్చు. అది భవిష్యత్తులో పెద్ద అవకాశంగా మారుతుంది. ఆరోగ్యం బావుంటుంది. సంబంధాలలో పారదర్శకత పెరుగుతుంది.
కుంభ రాశి (Aquarius Weekly Horoscope)
ఈ వారం మీకు కొత్త ప్రారంభానికి సంకేతం. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సాహిత్యం, సంగీతం లేదా కళలతో సంబంధం ఉన్నవారు పెద్ద విజయాన్ని సాధించవచ్చు. ఆస్తి లేదా స్థలం కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. అలసటగా ఉంటారు కానీ మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కొత్త బంధం ప్రారంభమవుతుంది..పాత బంధంలో స్థిరత్వం వస్తుంది
మీన రాశి (Pisces Weekly Horoscope)
ఈ వారం కెరీర్లో జాగ్రత్త అవసరం. మీప్రవర్తన కారణంగా వ్యక్తిగత సంబంధాల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు. ఈ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువ కష్టపడితే కానీ మంచిఫలితం సాధించలేరు.
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

