IPL 2025 RR vs RCB: జైస్వాల్ హాఫ్ సెంచరీ, రాణించిన జురెల్- ఆర్సీబీకి మోస్తరు టార్గెట్ ఇచ్చిన రాజస్తాన్ రాయల్స్
IPL 2025 RR vs RCB Highlights : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీతో ఓవర్లలో 173 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 75 పరుగులతో రాణించాడు.

RR vs RCB, IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ఆతిథ్య రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో హజెల్ వుడ్, కృనాల్ పాండ్యా, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. సుయాశ్ శర్మ 4 ఓవర్లలో 39తో అత్యధిక పరుగులు సమర్పించుకున్నాడు.
ఆదివారం జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR)తో 28వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు పవర్ ప్లేలో వికెట్లు పోకుండా జాగ్రత్తగా ఆడారు. ఆపై కెప్టెన్ సంజూ శాంసన్ (15) తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. జట్టు స్కోరు 49 పరుగుల వద్ద కృనాల్ పాండ్యా బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ భారీ హాఫ్ సెంచరీ చేశాడు. వేగంగా ఆడే క్రమంలో రియాన్ పరాగ్ (220 బంతులలో 30 పరుగులు) యశ్ దయాల్ కు చిక్కాడు. కోహ్లీ క్యాచ్ అందుకోవడంతో పరాగ్ ఔటయ్యాడు.
మరో ఎండ్ లో జైస్వాల్ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును నడిపించాడు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో జైస్వాల్ ఔటయ్యాడు. హెజల్ వుడ్ బౌలింగ్ లో యశస్వీ జైస్వాల్ (47 బంతులలో 75 పరుగులు, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దృవ్ జురేల్ (35) పరవాలేదనిపించాడు. చివర్లో రాజస్తాన్ పరుగులు రాబట్టలేకపోవడంతో నిర్ణీత ఓవర్లలో 174 పరుగులు చేసి ఆర్సీబీకి మోస్తరు టార్గెట్ ఇచ్చింది.
𝗜.𝗖.𝗬.𝗠.𝗜
— IndianPremierLeague (@IPL) April 13, 2025
🎥 Air Salt was in operation ✈
What a fantastic effort from Phil Salt at the boundary! 😮
Updates ▶ https://t.co/rqkY49M8lt#TATAIPL | #RRvRCB | @RCBTweets pic.twitter.com/jaruMYKKqx
సంజు శాంసన్ టాస్ తరువాత మాట్లాడుతూ.. నిజానికి మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. సాధారణంగా సెకండ్ బ్యాటింగ్ చేయడం మెరుగ్గా ఉంటుంది. మాకు ఇక్కడి పరిస్థితులు కూడా తెలుసు. హసా జట్టులోకి తిరిగి వచ్చాడు. హసరంగా మా ఫరూఖీని భర్తీ చేయనున్నాడు అని నవ్వేశాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టీం గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగింది.





















