Anakapalli News: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, ఎనిమిది మంది మృతి- అనకాపల్లి జిల్లాలో ఘటన
అనకాపల్లి జిల్లాలోని కోటవురట్ల మండలంలోని కైలాసపట్నంలోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు.

Firecracker Manufacturing Unit | కోటవురట్ల: అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటవురట్ల మండలంలోని కైలాసపట్నంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. మొదట ఐదుగురు కార్మికులు మృతిచెందగా, మరో ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందడంతో కార్మికుల మరణాల సంఖ్య ఎనిమిదికి చేరుకున్నట్లు సమాచారం.
పేలుడుపై విచారణకు ఆదేశించిన కలెక్టర్
ఈరోజు ఆదివారం కావడంతో 15 మంది మాత్రమే కార్మికులు బాణాసంచా తయారీకి హాజరయ్యారు. ప్రమాదవశాత్తూ కేంద్రంలో పేలుడు సంభవించింది. భారీ శబ్ధంతో పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. Anakapalli జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

మృతుల వివరాలు..
తాతబాబు 50 ఏళ్లు
గోవింద 45
రామలక్ష్మి 38
నిర్మల 36
పురం పాపా 40,
బాబు 40
బాబురావు 56
మనోహర్
ప్రమాదంపై మంత్రి నారా లోకేష్..
బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇది దురదృష్టకర ఘటన అన్న ఆయన బాధిత కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇదొక దురదృష్టకర ఘటన. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా…
— Lokesh Nara (@naralokesh) April 13, 2025
అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి
అనకాపల్లి జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అనకాపల్లి జిల్లా అధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను అచ్చెన్నాయుడు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. సహాయక చర్యలు మరింత వేగవంతం చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి అగ్నిప్రమాద ఘటనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని నర్సీపట్నం ఆర్డీవోకు స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు. బెడ్లు, వెంటిలేటర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు.
హోం మంత్రి అనితకు డిప్యూటీ సీఎం ఫోన్
అనకాపల్లి జిల్లా కోటఉరట్ల ప్రమాదంపై డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మంత్రి అనితతో ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదంపై ఆరా తీసిన పవన్ కళ్యాణ్, క్షతగ్రాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా నిలవాలన్నారు. ప్రతి ఏడాది బాణసంచా తయారీ కేంద్రాల్లో ఏదో ఓ చోట ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అక్కడ పనిచేసే కార్మికులు ఈ ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారు.






















