అన్వేషించండి

Navel Oiling for One Month : రెండు చుక్కల నూనెను ప్రతిరోజూ ఆ సమయంలో బొడ్డుపై అప్లై చేస్తే ఎంతో మంచిదట, బెనిఫిట్స్ ఇవే

Navel Oiling : నాభిపై రెండు చుక్కల నూనె వేసి మసాజ్ చేస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. నెలరోజులు ఇలా చేస్తే శరీరంలో ఈ మార్పులు వస్తాయట. 

Navel Oiling Benefits : బొడ్డుపై నూనె రాస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తోంది ఆయుర్వేదం. దీనివల్ల శరీరానికి, అందానికి, ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయని చెప్తుంది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఎలాంటి ఆయిల్​ని ఎంచుకుంటే మంచిది? ఏ సమయంలో ఈ మసాజ్ చేస్తే మంచి ప్రయోజనాలు అందుతాయి? నెలరోజులు ఈ ప్రక్రియ ఫాలో అయితే కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

నాభికి నూనె రాస్తే కలిగే లాభాలివే.. 

టాక్సిన్లను బయటకు పంపి జీర్ణక్రియ మెరుగుచేస్తుంది. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ టెక్నిక్ ఫాలో అవ్వడం వల్ల సమస్యను దూరం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా పూర్తి గట్ హెల్త్​ మెరుగవుతుంది. స్కిన్ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది. స్కిన్​ని మాయిశ్చరైజ్ చేస్తుంది. రాత్రుళ్లు ఈ మసాజ్ చేసుకుంటాము కాబట్టి విశ్రాంతిని అందించి నిద్రను మెరుగుపరుస్తుంది. 

నెల రోజులు అప్లై చేస్తే కలిగే ప్రయోజనాలివే

నాభికి నెలరోజులు నూనెను అప్లై చేస్తే మీరు ఎన్నో మార్పులు చూడవచ్చు. జీర్ణక్రియ గణనీయంగా మెరుగవుతుంది. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. మలబద్ధకం దూరమవుతుంది. పోషకాల శోషణ జరిగి గట్ హెల్త్ మెరుగవుతుంది. కీళ్ల నొప్పులు కంట్రోల్ అవుతాయి. రక్త ప్రసరణ మెరుగై చర్మానికి మేలు చేస్తుంది. స్కిన్​ పొడిబారడం తగ్గి మాయిశ్చరైజ్ అవుతుంది. మొటిమలు కంట్రోల్ అవుతాయి. పిగ్మెంటేషన్​ని దూరం చేసుకోవచ్చు. రిప్రొడెక్షన్​కి మద్ధతునిస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు దూరమవుతాయి. పీసీఓఎస్ సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఇది మంచి ఫలితాలు ఇస్తుందని చెప్తున్నారు. 

ఎలా అప్లై చేయాలంటే.. 

ముందుగా నాభికి ఎలాంటి నూనెను అప్లై చేస్తే తెలుసుకోవాలి. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆముదం మంచి ఆప్షన్. ఆయుర్వేదంలో ఆముదంతో మంచి ప్రయోజనాలు అందుతాయని చెప్తారు. మీరు ఆయిల్​ని ఎంచుకున్న తర్వాత దానిని కాస్త గోరువెచ్చగా చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న నూనెను కొన్ని చుక్కలు బొడ్డుపై వేసుకోవాలి. ఇప్పుడు మీ చేతులతో దానిని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. వృత్తాకార దిశలో రౌండ్​గా మసాజ్ చేసుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల ఆయిల్ చర్మంలోపలికి వెళ్లి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. 

ఫాలో అవ్వాల్సిన టిప్స్ 

నూనెను అప్లై చేసే ముందు నాభిని శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత ఆయిల్​ని అప్లై చేయాలి. రాత్రుళ్లు అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మసాజ్​ని ఫోర్స్​గా కాకుండా ఇరిటేషన్ లేకుండా సున్నితంగా చేయాలి. మెరుగైన ఫలితాల కోసం రోజూ.. నిద్రపోయే ముందు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

నాభికి నూనెను అప్లై చేయడం మంచిదే అయినా.. మీకు స్కిన్ ఇరిటేషన్, సెన్సిటివిటీ, ఇతర సమస్యలు ఉంటే అప్లై చేయకపోవడమే మంచిది. అలెర్జీలు వంటివి ఉంటే వైద్యుల సలహాతో దీనిని ఫాలో అవ్వొచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
Myanmar Earthquake: మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
NTR: 'క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు కన్నీళ్లు ఆగవు' - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' స్పెషల్ మూవీ అవుతుందన్న ఎన్టీఆర్.. 'వార్ 2'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు కన్నీళ్లు ఆగవు' - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' స్పెషల్ మూవీ అవుతుందన్న ఎన్టీఆర్.. 'వార్ 2'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shreyas Iyer Reading Abhishek Sharma Paper | ఆ పేపర్ లో ఏముంది అభిషేక్ | ABP DesamAbhishek Sharma Thanking Yuvraj Singh | యువీ లేకపోతే నేను లేనంటున్న అభిషేక్ శర్మ | ABP DesamAbhishek Sharma 141 vs PBKS | IPL 2025 లో సంచలన సెంచరీ బాదిన అభిషేక్ శర్మ | ABP DesamSRH vs PBKS Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 8వికెట్ల తేడాతో సన్ రైజర్స్ సంచలన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
Myanmar Earthquake: మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
NTR: 'క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు కన్నీళ్లు ఆగవు' - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' స్పెషల్ మూవీ అవుతుందన్న ఎన్టీఆర్.. 'వార్ 2'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు కన్నీళ్లు ఆగవు' - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' స్పెషల్ మూవీ అవుతుందన్న ఎన్టీఆర్.. 'వార్ 2'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
CM Chandrababu: సత్యసాయి జిల్లాలో  రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Mark Shankar: కుమారుడు మార్క్ శంకర్‌తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ దంపతులు - కొడుకుని ఎత్తుకుని మరీ..
కుమారుడు మార్క్ శంకర్‌తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ దంపతులు - కొడుకుని ఎత్తుకుని మరీ..
Kancha Gachibowli Land Dispute: ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
IPL 2025 SRH Record Chasing:  ఆరెంజ్ అలెర్ట్... బౌల‌ర్ల‌కి వార్నింగ్ పంపిన్ స‌న్ బ్యాట‌ర్లు.. పంజాబ్ పై రికార్డు ఛేజింగ్.. అభిషేక్ విధ్వంస‌క సెంచ‌రీ, హెడ్ ఫిఫ్టీ.. పంజాబ్ చిత్తు
ఆరెంజ్ అలెర్ట్... బౌల‌ర్ల‌కి వార్నింగ్ పంపిన్ స‌న్ బ్యాట‌ర్లు.. పంజాబ్ పై రికార్డు ఛేజింగ్.. అభిషేక్ విధ్వంస‌క సెంచ‌రీ, హెడ్ ఫిఫ్టీ.. పంజాబ్ చిత్తు
Embed widget