అన్వేషించండి

Uttarakhand Tunnel Rescue: 150 గంటలు గడిచినా శిథిలాల కిందే కార్మికులు, వర్టికల్ డ్రిల్లింగ్‌ ఆప్షన్ వర్కౌట్ అవుతుందా?

Uttarakhand Tunnel Rescue: ఉత్తరాఖండ్‌ సొరంగంలో 150 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Uttarakhand Tunnel Rescue Opeartion:


150 గంటలు...

ఉత్తరాఖండ్‌ సొరంగంలో (Uttarakhand Tunnel Rescue) చిక్కుకున్న 40 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి 150 గంటలు గడిచినా ఇంకా వాళ్లను బయటకు తీసుకొచ్చే దారి దొరకడం లేదు. అమెరికా నుంచి స్పెషల్ మెషీన్ తెప్పించి మరీ డ్రిల్లింగ్ చేస్తున్నారు. పదుల సంఖ్యలో రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది చాలానే శ్రమిస్తున్నారు. మెషీన్‌లో సమస్య కారణంగా కాసేపు రెస్క్యూ ఆపరేషన్ ఆగిపోయింది. మెషీన్‌ విరిగిన చప్పుడు గట్టిగా వినిపించడం వల్ల సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే ఆపరేషన్‌ని నిలిపివేసింది. తరవాత వెంటనే మరో భారీ డ్రిల్లింగ్ మెషీన్‌ని (Uttarakhand Tunnel Collpase) తెప్పించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ఆందోళనకు లోను కాకుండా అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. పైప్‌ల ద్వారా ఆహారం, ఆక్సిజన్ అందిస్తున్నారు. ఘటనా స్థలానికి ప్రధాన మంత్రి కార్యాలయం (PM Ofiice) డిప్యుటీ సెక్రటరీ మంగేశ్ ఘిల్దియాల్‌ చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఆగిపోయిన కాసేపటికే ఆయన అక్కడికి వచ్చారు. పరిస్థితులపై ఆరా తీశారు. సహాయక చర్యలకు (Rescue Operation) అవసరమైన పరికరాలన్నీ ఉన్నాయని, వాళ్లను కచ్చితంగా సురక్షితంగా బయటకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జియోమ్యాపింగ్ టీమ్‌తో పాటు డ్రిల్లింగ్ మెషీన్‌లు (Uttarakhand Drilling Machine) ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 

"వాళ్లను బయటకు తీసుకొచ్చేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టం. ఏదో  ఒకటి చేసి కాపాడతాం. ఈ రెస్క్యూ ఆపరేషన్‌కిఅవసరమైన సామగ్రి అంతా అందుబాటులోనే ఉంది. ఒక ఆప్షన్‌ ఫెయిల్ అయితే మరో ఆప్షన్‌ ఆలోచిస్తాం. మాకు కావాల్సిందల్లా కో ఆర్డినేట్ చేసే టీమ్. నిలువుగా డ్రిల్లింగ్ చేసే ఆలోచన కూడా చేస్తున్నాం. ఇది చివరి ఆప్షన్‌గా పెట్టుకుంటున్నాం. విదేశాలకు చెందిన నిపుణులు కూడా మాకు అవసరమైన సాయం చేస్తున్నారు."

- రెస్క్యూ ఆపరేషన్ అధికారులు 

మానసిక ఆందోళన..

ప్రస్తుతానికి ఆ 40 మంది ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ సహాయక చర్యల్లో జాప్యం కారణంగా (Uttarakhand Tunnel Collapse) ఆందోళన వ్యక్తమవుతోంది. వాళ్లు సురక్షితంగా బయటకు వస్తారా లేదా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. థాయ్‌లాండ్, నార్వే నుంచి రెండు రెస్క్యూ టీమ్స్‌ వచ్చాయి. ఇప్పటి వరకూ కొండ చరియలను 30 మీటర్ల లోతు వరకూ డ్రిల్లింగ్ చేసి భారీ పైప్‌లు (Uttarakhand Tunnel Rescue Opearation) జొప్పించారు. వాటి ద్వారానే ఆహారం, ఆక్సిజన్ అందిస్తున్నారు. మొత్తం 5 పైప్‌లు అమర్చి కొంత వరకూ వాళ్లను సురక్షితంగా ఉంచగలుగుతున్నారు. అటు వైద్యులు మాత్రం వీలైనంత త్వరగా వాళ్లను బయటకు తీసుకురావాలని, లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. ఫిజికల్‌గానే కాకుండా మానసికంగా కూడా వాళ్లు కుంగిపోయే అవకాశముందని అంటున్నారు. శిథిలాలు మీద పడే ప్రమాదం ఉండడం వల్ల ప్రాణాలు కాపాడడం కాస్త సవాలుతో కూడిన పనే అంటున్నారు వైద్యులు. 

Also Read: ChatGPT Sam Altman: చాట్‌జీపీట్‌ సృష్టికర్తకు ఘోర అవమానం, అతనిపై నమ్మకం లేదంటూ ఉద్యోగం నుంచి తొలగింపు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
Deadbody Parcel: 'చేప దొరికిందా?' - శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా?, చెక్క పెట్టెలో డెడ్ బాడీ వెనుక అంతుచిక్కని ప్రశ్నలెన్నో?
'చేప దొరికిందా?' - శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా?, చెక్క పెట్టెలో డెడ్ బాడీ వెనుక అంతుచిక్కని ప్రశ్నలెన్నో?
Embed widget