అన్వేషించండి

ChatGPT Sam Altman: చాట్‌జీపీట్‌ సృష్టికర్తకు ఘోర అవమానం, అతనిపై నమ్మకం లేదంటూ ఉద్యోగం నుంచి తొలగింపు

Sam Altman News: ఓపెన్‌ఏఐలో పని చేయడాన్ని తాను ఇష్టపడ్డానని, నిపుణులతో కలిసి పని చేయడాన్ని ఆస్వాదించానని, తన వల్ల ప్రపంచం కొంచెం మారిందని తాను నమ్ముతున్నానని ఆ ట్వీట్‌లో రాశారు.

Business News in Telugu: కంటెంట్‌ సెర్చ్‌ను కృత్రమ మేథకు (Artificial Intelligence) జత చేసి, చాట్‌జీపీటీని (ChatGPT) సృష్టించిన శామ్‌ ఆల్ట్‌మన్‌కు (Sam Altman) తీవ్ర అవమానం ఎదురైంది. శామ్‌ ఆల్ట్‌మన్‌ను CEO సీటు నుంచి బలవంతంగా దింపేస్తూ ఓపెన్‌ఏఐ (OpenAI) కంపెనీ నిర్ణయం తీసుకుంది.

బోర్డుతో నిజాయితీగా లేడట
శామ్‌ ఆల్ట్‌మన్ CEO పదవి నుంచి వైదొలిగారని, తాత్కాలిక CEOగా టెక్నాలజీ చీఫ్ మిరా మురాటిని నియమించినట్లు OpenAI డైరెక్టర్ల బోర్డు శుక్రవారం ప్రకటించింది. డైరెక్టర్ల బోర్డుతో అతను నిజాయితీగా వ్యవహరించడం లేదని, బోర్డు  బాధ్యతలకు అడ్డుపడుతున్నాడని పేర్కొంది. "శామ్‌ ఆల్ట్‌మన్‌ నాయకత్వంపై బోర్డుకు ఇకపై విశ్వాసం లేదు" అని ఆ ప్రకటనలో వెల్లడించింది. CEO సీటు నుంచి దిగిపోయినా... శామ్‌ ఆల్ట్‌మన్‌ కంపెనీలోనే కొనసాగుతారని, CEOకి రిపోర్ట్‌ చేస్తూ, తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తారని ఓపెన్‌ఏఐ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. 

శామ్‌ ఆల్ట్‌మన్‌ను CEO బాధ్యతల నుంచి బలవంతంగా తొలగిస్తూ ఓపెన్‌ఏఐ తీసుకున్న నిర్ణయం గ్లోబల్‌ కార్పొరేట్‌ వర్గాల్లో సంచలనంగా మారింది. 

OpenAI CEO బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు శామ్‌ ఆల్ట్‌మన్ కూడా వెల్లడించారు, దీనిపై Xలో ట్వీట్‌ చేశారు. ఓపెన్‌ఏఐలో పని చేయడాన్ని తాను ఇష్టపడ్డానని, నిపుణులతో కలిసి పని చేయడాన్ని ఆస్వాదించానని, తన వల్ల ప్రపంచం కొంచెం మారిందని తాను నమ్ముతున్నానని ఆ ట్వీట్‌లో రాశారు.

మైక్రోసాఫ్ట్‌ ఒత్తిడితోనే శామ్‌ ఆల్ట్‌మన్‌కు ఉద్వాసన!
దిగ్గజ టెక్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్ (Microsoft), ఓపెన్‌ఏఐలో బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. తన సెర్చ్‌ ఇంజిన్‌ బింగ్‌లో చాట్‌జీపీట్‌ని వినియోగిస్తోంది. శామ్‌ ఆల్ట్‌మన్ పనితీరుపై మైక్రోసాఫ్ట్‌ కొంతకాలంగా సంతృప్తిగా లేదు. ఈ నేపథ్యంలో, మైక్రోసాఫ్ట్‌ ఒత్తిడి వల్లే శామ్‌ ఆల్ట్‌మన్ CEO ఛైర్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.

శామ్‌ ఆల్ట్‌మన్‌ను CEO బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల (Microsoft CEO Satya Nadella) Xలో ఒక ట్వీట్‌ చేశారు. ఓపెన్‌ఏఐతో మైక్రోసాఫ్ట్‌ దీర్ఘకాలిక ఒప్పందం గురించి ఆ ట్వీట్‌లో వెల్లడించారు. ఓపెన్‌ఏఐతో కలిసి మరిన్ని కొత్త సేవలు తెస్తామని వివరించారు. మిరాతో, అతని బృందంతో కలిసి ముందుకు సాగుతామన్నారు. శామ్‌ ఆల్ట్‌మన్ నిష్క్రమణ గురించి మాత్రం సత్య నాదెళ్ల ప్రస్తావించలేదు.

మరో కీలక పరిణామం
శామ్‌ ఆల్టమన్‌ను తప్పించిన గంటల వ్యవధిలోనే ఓపెన్‌ఏఐ కంపెనీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓపెన్‌ఏఐ కో-ఫౌండర్‌, ప్రెసిండెట్‌ గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ (Greg Brockman) కూడా తన పదవికి రాజీనామా చేశారు. గ్రెగ్‌ రిజిగ్నేషన్‌కు కారణం శామ్‌ ఆల్టమన్‌ను తొలగించమే. ఈ విషయాన్ని గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ స్వయంగా Xలో పోస్ట్‌ చేశారు. గత 8 సంవత్సరాలుగా తామంతా కలిసి సృష్టించిన అద్భుతాల పట్ల తాను గర్విస్తున్నాని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. తమ బృందం చాలా కఠిన సమస్యలను ఎదుర్కొందని, అయినా అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించామని వెల్లడించారు. శామ్‌ ఆల్ట్‌మన్‌ తొలగింపు తర్వాత ఓపెన్‌ఏఐని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు ట్వీట్‌లో వివరించారు. 

మైక్రోసాఫ్ట్ నుండి బిలియన్‌ డాలర్లను సేకరించిన ఓపెన్‌ఏఐ, ఈ సంవత్సరం CNBC డిస్‌రప్టర్ 50 జాబితాలో (CNBC’s Disruptor 50 list) ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. 2022 చివరిలో AI చాట్‌బాట్ చాట్‌జీపీటీని ఈ కంపెనీ పబ్లిక్‌లోకి లాంచ్‌ చేసింది. సాధారణ టెక్ట్స్‌ను సృజనాత్మక సంభాషణగా మారుస్తూ, యూజర్‌ కోరుకున్న సమాచారాన్ని తెలివిగా అందిస్తున్న చాట్‌జీపీటీ చాలా త్వరగా వైరల్‌ అయింది. చాట్‌జీపీటీ బ్రహ్మాండమైన సక్సెస్‌ కావడంతో... ఆల్ఫాబెట్ (Alphabet), మెటా (Meta) వంటి పెద్ద టెక్ కంపెనీలు కూడా AIలో పెట్టుబడులు పెంచేందుకు నిర్ణయించాయి.

మరో ఆసక్తికర కథనం: వరుస బెట్టి ఆస్తులు అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా, మరో రెండు ఫ్లాట్లకు బేరం

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget