అన్వేషించండి

Uttarakhand Tunnel Collapse: శిథిలాల కింద చిక్కుకుని 120 గంటలు,రెస్క్యూ ఆపరేషన్ ఎంత వరకూ వచ్చింది?

Uttarkashi tunnel News: ఉత్తరాఖండ్‌ సొరంగంలో కార్మికులు చిక్కుకుని 120 గంటలు దాటింది.

కొనసాగుతున్న సహాయక చర్యలు..

Uttarakhand Tunnel Collapse News in Telugu: ఉత్తరాఖండ్‌ సొరంగం ( Uttarakhand Tunnel Incident) వద్ద సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న 40 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు అధికారులు. స్పెషల్ రెస్క్యూ టీమ్స్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 120 గంటలుగా ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి ఆ 40 మంది ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ సహాయక చర్యల్లో జాప్యం కారణంగా (Uttarakhand Tunnel Collapse) ఆందోళన వ్యక్తమవుతోంది. వాళ్లు సురక్షితంగా బయటకు వస్తారా లేదా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. థాయ్‌లాండ్, నార్వే నుంచి రెండు రెస్క్యూ టీమ్స్‌ వచ్చాయి. ఇప్పటి వరకూ కొండ చరియలను 30 మీటర్ల లోతు వరకూ డ్రిల్లింగ్ చేసి భారీ పైప్‌లు (Uttarakhand Tunnel Rescue Opearation) జొప్పించారు. వాటి ద్వారానే ఆహారం, ఆక్సిజన్ అందిస్తున్నారు. మొత్తం 5 పైప్‌లు అమర్చి కొంత వరకూ వాళ్లను సురక్షితంగా ఉంచగలుగుతున్నారు. అటు వైద్యులు మాత్రం వీలైనంత త్వరగా వాళ్లను బయటకు తీసుకురావాలని, లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. ఫిజికల్‌గానే కాకుండా మానసికంగా కూడా వాళ్లు కుంగిపోయే అవకాశముందని అంటున్నారు. శిథిలాలు మీద పడే ప్రమాదం ఉండడం వల్ల ప్రాణాలు కాపాడడం కాస్త సవాలుతో కూడిన పనే అంటున్నారు వైద్యులు. 

"అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అసలు బతుకుతామా లేదా, బయటకు వెళ్తామా లేదా అన్న అనుమానం, భయం పెరిగే కొద్ది ఆందోళన పెరిగిపోతుంది. తమకు ఎవరూ సాయం చేయడం లేదన్న అసహనం పెరుగుతుంది. పూర్తిగా ట్రామాలోకి వెళ్లిపోయే ప్రమాదముంది. అదే జరిగితే వాళ్లు రెస్క్యూ ఆపరేషన్‌కి కూడా సహకరించే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇన్ని రోజుల పాటు అలా చీకటిలో ఉండడం వల్ల భయంతో గుండెపోటు వచ్చే ప్రమాదమూ ఉంది. ఆక్సిజన్, కార్బన్‌ డైయాక్సైడ్‌ లెవెల్స్ కూడా వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. పూర్తిగా కోమాలోకి వెళ్లే ప్రమాదముంది"

- మానసిక వైద్యులు 

సహాయక చర్యలు కొనసాగుతుండగా కొండచరియలు విరిగిపడటం, డ్రిల్ యంత్రం ఫెయిల్ అవడంతో అధికారులు అధునాతన డ్రిల్లింగ్ పరికరాలను తెప్పించారు. ఈ ఆపరేషన్‌లో ఇండియన్ నేవీ సైతం కీలక పాత్ర పోషిస్తోంది. కొత్త డ్రిల్లింగ్ మెషీన్‌ను విమానంలో సైట్‌కు తరలించింది. అలాగే ఇలాంటి ఆపరేషన్లలో అనుభవం ఉన్న నార్వే, థాయిలాండ్ నిపుణులను సంప్రదిస్తున్నారు. ఘటనాస్థలిని కేంద్ర మంత్రి వీకే సింగ్ పరిశీలించారు. రెస్క్యూ ప్రయత్నాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిక్కుకున్న వారందరిని రక్షించడం తమ బాధ్యత అన్నారు. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థల నుంచి సాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ మాట్లాడుతూ.. సంస్థ రెస్క్యూ ప్రయత్నాలను నిశితంగా పరిశీలిస్తోందని, సాధ్యమైన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

Also Read: Kulgam Encounter: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్, ఐదుగురు ఉగ్రవాదులు హతం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Cold Weather Safety Tips : పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
Embed widget