By: ABP Desam | Updated at : 21 Sep 2023 10:32 AM (IST)
మహిళా బిల్లు వెనుక ఉన్నదెవరు ? నిర్విరామంగా పోరాటం చేసిన యోధురాలెవరు ?
మూడు దశాబ్దాల మహిళల నిరీక్షణ ఫలించబోతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. 454 మంది సభ్యులు బిల్లుకు మద్దతు ఇచ్చారు. కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. గురువారం రాజ్యసభలోనూ ఆమోదం పొందితే మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చనుంది. మహిళా బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంతో కొత్త చర్చ మొదలైంది. ఈ బిల్లును తొలిసారి ఎవరు లోక్ సభలో ప్రవేశపెట్టారన్న అంశం ఆసక్తికరంగా మారింది. లోక్ సభలో బిల్లు ఆమోదం పొందాక...బిల్లు పూర్వాపరాలను ఆరా తీస్తున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మూలకారణంన గీతా ముఖర్జీ. మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో...యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొట్టమొదటి సారి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును సెప్టెంబర్ 12, 1996లో గీతా ముఖర్జీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఆమె.. బిల్లుపై సమగ్ర సమీక్ష చేసి, ఏడు కీలక సిఫార్సులు చేశారు. వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో 1998, 1999, 2002, 2003లో, కాంగ్రెస్ హయాంలో 2010లో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. 186 మంది మహిళా బిల్లుకు సపోర్ట్ చేశారు. 2014లో లోక్‌సభ రద్దు కావడంతో అక్కడే బిల్లు మురిగిపోయింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్.. మహిళా రిజర్వేషన్లపై కొత్త బిల్లును తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందినా 2027 తర్వాత రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్రం చెబుతోంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రొటేషన్ ప్రక్రియలో రిజర్వు సీట్ల కేటాయింపు ఉంటుంది.
గీతా ముఖర్జీ బెంగాలీలో భారత్ ఉపకథ, చోటోదేర్ రవీంద్రనాథ్, ‘నేక్‌డ్ ఎమాంగ్ వోల్వ్స్’ వంటి ఎన్నో పుస్తకాలు రాశారు. 76 ఏళ్ల వయసులో గుండెపోటుతో గీతా ముఖర్జీ కన్నుమూశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకోసం ఎంతో పోరాడిన ఆమె.. ఆయా ప్రభుత్వాలు దాన్ని పార్లమెంటులో ఆమోదింపజేయడంలో విఫలం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఎలాగైనా ఆమోదం పొందేందుకు చివరి వరకు తన ప్రయత్నాలను కొనసాగించారు. వాజ్‌పేయీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది.
కోల్‌కతాలో 1924లో జన్మించిన గీతా ముఖర్జీ.. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. సీపీఐ నేత బిశ్వనాథ్ ముఖర్జీని ఆమె వివాహం చేసుకున్నారు. అనంతరం 1946లో బెంగాల్ స్టేట్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి, కార్మిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అరెస్టయి ఆరునెలలపాటు జైల్లో ఉన్నారు. 1967లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టిన ఆమె.. 1977 వరకు కొనసాగారు. 1980లో పన్స్కుర లోక్‌సభ స్థానం నుంచి గెలుపొంది.. 2000 అదే స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. వివిధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యురాలిగా ఉన్న ఆమె.. మహిళలకు సంబంధించిన అనేక కమిటీల్లో ఉన్నారు. సామాజిక న్యాయం, మహిళల హక్కుల కోసం పోరాటంలో తన బలమైన గళాన్ని వినిపించారు.
Mizoram Election Result 2023: మిజోరంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు, అధికార ప్రభుత్వానికి షాక్!
JEE Main 2024: జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్‌కు నేటితో ఆఖరు, పరీక్ష వివరాలు ఇలా
ISRO Exam: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?
NTA CURE: కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా
Gold-Silver Prices Today 04 December 2023: చుక్కల్లో చేరిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
JC Prabhakar Reddy: తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు
CLP Meeting News: గచ్చిబౌలిలో సీఎల్పీ మీటింగ్, సీఎం ఎంపికపై తీర్మానాలు, ప్రమాణ స్వీకారం నేడే ఉంటుందా?
TDP News: యువగళం ముగింపు సభ భారీగా ప్లాన్ - చంద్రబాబు, పవన్ హాజరు
/body>