Bharat Jodo Yatra: బీజేపీ నేతలు "జై శ్రీరామ్" బదులుగా "జై సీతారామ్" అనాలి - రాహుల్ గాంధీ
Bharat Jodo Yatra: బీజేపీ నేతలు జైసీతారామ్ అనరని, వాళ్లకు సీతమ్మపై గౌరవం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు.
Bharat Jodo Yatra:
భారత్ జోడో యాత్రలో..
మధ్యప్రదేశ్‌లో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ని టార్గెట్ చేస్తూ విమర్శించారు. "RSS కార్యకర్తలు ఎప్పుడూ జై సీతా రామ్ అని అనరు. వాళ్ల సంస్థలో ఒక్క మహిళ కూడా లేదు" అని అన్నారు. ఆ తరవాత తనకు ఎదురైన ఓ అనుభవాన్ని పంచుకున్నారు.
"ఓ పండిట్ నా దగ్గరకు వచ్చాడు. రాహుల్ జీ రాముడు తన జీవితాన్ని ఓ తపస్సులా భావించారు. అందుకే గాంధీజీ "హేరామ్ అనే వారు" అని నాతో అన్నాడు. అప్పుడే ఆ పండిట్ నాకు మరో స్లోగన్ గురించి చెప్పాడు. అది జై సీతా రామ్. సీతారాములు వేరు వేరు కాదు. ఇద్దరూ ఒక్కటే. అందుకే జై సీతారామ్ అనాలి అని చెప్పాడు. సీత కోసం రాముడు చేసిందేటో మనం గుర్తించాలి. రాముడి తోనే సీత ఉండాలి. అదే ఆమెకు గౌరవం. అందుకే జై సీతారామ్ అనాలి. జై శ్రీరామ్ అనేది కేవలం రాముడి గొప్పదనాన్ని మాత్రమే సూచిస్తుందని వివరించాడు. అప్పుడే నన్ను ఆ పండిట్ ఓ మాట చెప్పాడు. బీజేపీ ఎప్పుడూ జై సీతారామ్ అని ఎందుకు అనదో మీరు అడగాలని అన్నాడు. ఆ ప్రశ్న నన్నెంతోఆకర్షించింది" - రాహుల్ గాంధీ
ఆ తరవాత రాహుల్ BJP,RSSపై మండి పడ్డారు. వాళ్లు జై సీతారామ్ అనలేరని, ఎందుకంటే రాముడి స్ఫూర్తిని వాళ్లు సరిగ్గా అర్థం చేసుకోలేదని విమర్శించారు. రాముడు ప్రజలందరి ఉన్నతి కోసం పాటు పడ్డారని, బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ ఈ స్ఫూర్తిని అనుసరించడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
ఉత్సాహంగా రాహుల్..
కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో ఉత్సాహంగా కొనసాగుతోంది. మోవ్ ప్రాంతంలో పర్యటించిన రాహుల్ గాంధీ...బైక్ రైడ్ చేసి సందడి చేశారు. మల్వా నిమర్ ప్రాంతంలో జనసందోహం మధ్య బైక్ నడుపుతూ అందరినీ ఉత్సాహ పరిచారు. అయితే...అంతకు ముందు ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాహుల్ ర్యాలీ ప్రారంభమయ్యే ఓ పావు గంట ముందు మోవ్ టౌన్‌లో పవర్ కట్ చేశారు. సిటీ అంతా పావుగంటలోనే రెండు సార్లు పవర్ కట్ చేశారని స్థానికులు తెలిపారు. రాహుల్ గాంధీ వచ్చే సమయానికి కరెంట్ వచ్చినప్పటికీ...ఆ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇది చేశారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. పవర్ కట్ అనేది సహజం కాదని, రాష్ట్ర ప్రభుత్వం కుట్ర అని మండి పడ్డారు. అయితే...విద్యుత్ అధికారులు మాత్రం టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లే జరిగిందని వివరణ ఇచ్చారు. రాహుల్‌తో పాటు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాగేల్ కూడా యాత్రలో పాల్గొన్నారు.
Also Read: Blank Page Revolution: చైనాలో బ్లాంక్ పేజ్ రెవల్యూషన్, A4 సైజ్ పేపర్లతో పౌరుల నిరసనలు