Ananya Nagalla: తెలుగమ్మాయి రూటే సపరేటు... ఆ జానర్‌లో అనన్య నాగళ్లకు పోటీ లేదుగా, ఇప్పుడు బాలీవుడ్‌లో?
Ananya Nagalla Movies: 'మల్లేశం'తో నాయికగా పరిచయమైన అనన్యా నాగళ్ల... 'ప్లే బ్యాక్, వకీల్ సాబ్, పొట్టేల్, తంత్ర'తో పేరు తెచ్చుకున్నారు. ఆవిడ ఓ విషయంలో మిగతా హీరోయిన్లకు భిన్నంగా ముందుకు వెళ్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి ఏడాది కొత్త హీరోయిన్లు వస్తుంటారు. అందువల్ల, తమ ప్రతిభ చాటుకుని ఉనికి నిలబడేలా సినిమాలు చేయడం సులభం కాదు. అందులోనూ హీరోయిన్లుగా నార్త్ ఇండియన్ అమ్మాయిల హవా ఎక్కువగా ఉన్న ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు పైకి రావడం కష్టం అనే అభిప్రాయం ఉంది. అయితే, అనన్యా నాగళ్ళ మాత్రమే సపరేట్ రూటులో పోటీ లేకుండా ముందుకు దూసుకు వెళుతున్నారు.
లో బడ్జెట్ సినిమాలకు పెద్ద దిక్కు...
ఫిమేల్ సెంట్రిక్ సినిమా అంటే అనన్య!
'మల్లేశం'తో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైన అమ్మాయి అనన్యా నాగళ్ళ. తర్వాత అందంతోనూ ఆడియన్స్ అందరినీ ఆవిడ ఆకట్టుకుని వరుస సినిమాలు చేశారు. హార్డ్ వర్క్, డెడికేషన్ ఉండటంతో తక్కువ సమయంలో మంచి స్థాయికి చేరుకున్నారు.
హీరోయిన్లలో మిగతా అమ్మాయిలతో కంపేర్ చేస్తే అనన్యా నాగళ్ళది సపరేట్ రూట్. 'వకీల్ సాబ్' వంటి సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. 'తంత్ర' వంటి సినిమాలో మెయిన్ లీడ్ (హీరోయిన్) రోల్ చేశారు. ముఖ్యంగా ఆవిడ ఒక తరహా పాత్రలకు పరిమితం కాలేదు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేశారు. 'తంత్ర' హిందీ వెర్షన్ జియో హాట్ స్టార్ ఓటీటీలో టాప్ 2లో ట్రెండ్ అవుతోంటే... 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో టాప్ 5లో ఉంది. దాంతో ఆవిడతో ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నట్లు తెలిసింది.
Also Read: ఓటీటీలోకి ఈ వారమే 600 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఇటీవల అనన్యా నాగళ్ళ ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమాకు సంతకం చేసినట్టు టాక్. ఆ మూవీ బడ్జెట్ ఆల్మోస్ట్ 5 కోట్ల రూపాయలు అట. ఒక హీరోయిన్ మీద ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం అంటే మామూలు విషయం కాదు. 'తంత్ర'తో పాటు 'బహిష్కరణ' వెబ్ సిరీస్, 'పొట్టేల్' సినిమాకు ఓటీటీలో మంచి ఆదరణ లభించింది. దాంతో అనన్యతో సినిమా చేస్తే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా మంచి అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. థియేట్రికల్ మార్కెట్ చేసుకుంటే చాలు. అందువల్ల, లో బడ్జెట్ ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు అనన్యా నాగళ్ళ పెద్ద దిక్కు అయ్యారనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.
త్వరలో అనన్య బాలీవుడ్ ఎంట్రీ!?
ఇప్పుడు రూ. 5 కోట్ల నిర్మాణ వ్యయంతో తీసే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మెయిన్ లీడ్ ఆప్షన్లలో అనన్యా నాగళ్ళ ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం ఆవిడ వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. త్వరలో ఆవిడ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని సమాచారం. అది కూడా ఫిమేల్ సెంట్రిక్ సినిమా అట! అనన్యకు హిట్స్ ఇచ్చిన థ్రిల్లర్, హారర్ జానర్ సినిమా ఏమో!? వెయిట్ అండ్ సి.





















