By: Arun Kumar Veera | Updated at : 06 Apr 2025 03:11 PM (IST)
ప్లాన్ పక్కాగా ఉంటే మీరే కోటీశ్వరుడు! ( Image Source : Other )
SBI Long Term Equity Fund: "SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్" భారతదేశంలోని మొదటితరం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లలో (ELSS) ఒకటి. గతంలో దీనిని "SBI మాగ్నమ్ టాక్స్‌గెయిన్ స్కీమ్" (SBI Magnum Taxgain Scheme) అని పిలిచేవాళ్లు. ఈ 32 ఏళ్ల పన్ను ఆదా ఫండ్‌కు 3 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంది & పెట్టుబడిదారులకు పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పథకంలో, పెట్టుబడిదారులు "సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్" (SIP) ద్వారా నెలకు రూ. 1000 పెట్టుబడితో దాదాపు రూ. 1.50 కోట్లను కూడబెట్టుకోవచ్చు.
1993లో ప్రారంభమైన పథకం
మార్చి 31, 1993న ప్రారంభమైన ఈ ఫండ్, ప్రారంభంలో IDCW ఆప్షన్ (డివిడెండ్ ఆప్షన్) అందించింది. గ్రోత్ ఆప్షన్‌తో మే 7, 2007న లాంచ్ అయింది. ఈ పథకంలో రాబడిని 'నిఫ్టీ ఇండియా కన్సంప్షన్ టోటల్ రిటర్న్ ఇండెక్స్' (TRI) రాబడితో పోలుస్తారు.
ఈక్విటీల్లో 90 శాతం కేటాయింపులు
SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్‌లోకి వచ్చిన పెట్టుబడిదార్ల డబ్బులో 90 శాతం పైగా మొత్తాన్ని ఈక్విటీ & ఈక్విటీ సంబంధిత సాధనాలకు కేటాయిస్తారు. ముఖ్యంగా... ఆర్థిక, సాంకేతికత, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ & మైనింగ్ కంపెనీల్లో షేర్లు కొంటారు. మనీ మార్కెట్ సాధనాలలో 10 శాతం వరకు కేటాయింపు ఉంటుంది.
టాప్-5 హోల్డింగ్స్
ఈ ఫండ్ టాప్-5 హోల్డింగ్స్‌లో HDFC బ్యాంక్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ICICI బ్యాంక్ లిమిటెడ్, భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్, హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఉన్నాయి.
గత 12 నెలల్లో బ్రహ్మాండమైన రాబడి
SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, స్థిరమైన ఈక్విటీ పెట్టుబడుల ద్వారా మార్కెట్‌లోని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. తద్వారా, చిన్న మొత్తాల్లోని నెలవారీ పెట్టుబడులను పెద్ద నిధిగా మారుస్తుంది. గత ఒక సంవత్సర కాలంలో, ఈ ఫండ్ 7.79 శాతం రాబడిని అందించింది. ప్రారంభం నుంచి చూస్తే సగటున 16.43 శాతం వార్షిక రాబడిని తీసుకొచ్చింది. తద్వారా ప్రతి 3 సంవత్సరాలకు పెట్టుబడిదారుల డబ్బు రెట్టింపు పైగా పెరుగుతుంది. ఈ విధంగా, ఈ పథకంలో, ప్రతి నెలా రూ. 1000 SIP తో మీరు 32 సంవత్సరాల కాలంలో రూ. 1.4 కోట్ల వరకు నిధిని సృష్టించవచ్చు.
3 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి వరకు హోల్డ్ చేస్తే...
ప్రారంభ పెట్టుబడి: రూ. 1 లక్ష
నెలవారీ SIP మొత్తం - రూ. 10,000 (అనుకుందాం)
పెట్టుబడి వ్యవధి - 3 సంవత్సరాలు
3 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి - రూ. 4,60,000
20.93% వార్షిక (అంచనా) రాబడి రేటుతో రూ. 6,65,578
ఏప్రిల్ 3, 2025 నాటికి SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ - గ్రోత్ NAV రూ. 437.78 కాగా, వ్యయ నిష్పత్తి 0.95%. ఈ ఫండ్ "నిర్వహణలోని ఆస్తులు" (AUM) మార్చి 31, 2025 నాటికి రూ. 27,730.33 కోట్లకు పెరిగాయి. సెప్టెంబర్ 2016 నుండి దినేష్ బాలచంద్రన్ ఫండ్ మేనేజర్‌గా ఉన్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. "abp దేశం" ఎవరికీ, ఎప్పుడూ పెట్టుబడి సలహాలు ఇవ్వదు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.
SIP , PPFలో లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?
Investments for Child : పిల్లల ఫ్యూచర్ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్‌తో అధిక రాబడి మీ సొంతం
Children Day: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి
Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Maruti Victoris రియల్ వరల్డ్ మైలేజ్ టెస్ట్ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy