By: Shankar Dukanam | Updated at : 05 Nov 2025 01:16 PM (IST)
కోటీశ్వరుడ్ని చేసే సిప్ పెట్టుబడులు ( Image Source : Other )
SIP Investment: జీవితంలో భారీ మొత్తాన్ని కూడబెట్టుకోవడానికి డబ్బు సంపాదించడం మాత్రమే సరిపోదు. సంపాదించిన డబ్బును సరైన చోట పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యమని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. సాధారణ ఉద్యోగం లేదా వ్యాపారం చేసే వ్యక్తులు, ఎవరి ఆదాయం పరిమితంగా ఉంటుందో ఇది గమనించాలి. వారు దీర్ఘకాలికంగా, తెలివిగా పెట్టుబడి పెట్టడం ద్వారా సంపదను క్రియేట్ చేసుకుంటారు.
అదే సమయంలో కొంతమంది ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక డబ్బు విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని నష్టపోతుంటారు. దీనివల్ల వారికి ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. అందుకే ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్లో అందుబాటులో ఉన్న పెట్టుబడి ఛాయిస్‌ల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాంతో మీరు మీ పెట్టుబడిపై ఎక్కువ రాబడిని పొందవచ్చు. మీరు చిన్న మొత్తాలను ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే ఒక ఎంపిక కోసం చూస్తున్నారా, మీరు మ్యూచువల్ ఫండ్ SIP గురించి ఆలోచించాలి.
మ్యూచువల్ ఫండ్లలో SIP
మ్యూచువల్ ఫండ్లలో SIP చేయడం దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నవారికి సరైన ఎంపికగా చెప్పవచ్చు. మీ దగ్గర తక్కువ మొత్తం ఉండి, మీరు ప్రతి నెలా కొంచెం మొత్తం పెట్టుబడి పెడితే SIP ద్వారా మీరు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో కూడబెట్టుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో SIP ప్రత్యేకత ఏంటంటే.. మీరు ఇందులో 250 రూపాయల నుండి 500 రూపాయల చిన్న పెట్టుబడితో కూడా మీ SIP జర్నీ ప్రారంభించవచ్చు.
మార్కెట్ నిపుణులు మ్యూచువల్ ఫండ్లలో SIP ద్వారా సంవత్సరానికి 12 శాతం వరకు రాబడిని పొందవచ్చని చెబుతారు. అయితే, ఈ పెట్టుబడి మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటుంది. కనుక మార్కెట్ హెచ్చుతగ్గులకు భయపడకుండా దీర్ఘకాలిక పెట్టుబడి ద్వారా మీకు ప్రయోజనం కలుగుతుంది.
నెలకు రూ. 2000 SIPతో 1.59 కోట్ల ఫండ్ పొందవచ్చు
నెలకు 2000 రూపాయల SIP చేయడం ద్వారా మీరు 1.59 కోట్ల వరకు ఫండ్ పొందవచ్చు. దీని కోసం మీరు దాదాపు 30 సంవత్సరాల పాటు పెట్టుబడిని కొనసాగించాలి. ప్రతి సంవత్సరం మీ ఇన్వెస్ట్ మెంట్ 10 శాతం చొప్పున పెంచాలి. తొలి ఏడాది ప్రతినెలా రూ.2000 ఇన్వెస్ట్ చేసినట్లు అయితే, వచ్చే ఏడాది నుంచి పది శాతం పెంచుతూ రూ.2200 సిప్ చేయాలి. అలా ప్రతి ఏడాది మీ ఆదాయం పెరుగుతుంది కనుక పెద్ద మొత్తం సంపాదించడానికి పది శాతం సిప్ స్టెప్ అప్ చేయాలని నిపుణులు చెబుతుంటారు. మీరు త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, అంటే జాబ్ వచ్చిన కొత్తలోనే 20 నుంచి 25 ఏళ్లలోనే సిప్ మొదలుపెట్టే వారికి అధిక ప్రయోజనం చేకూరుతుంది. దాంతో మీరు దీర్ఘకాలిక నగదు లక్ష్యాన్ని చేరవచ్చు.
Note: ఇక్కడ అందించిన విషయాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. మార్కెట్లో పెట్టుబడి అనేది మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటుందని తెలుసుకోండి. డబ్బు ఇన్వెస్ట్ చేసే పెట్టే ముందు, ఎల్లప్పుడూ ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోండి. మీ పెట్టుబడులకు ఏబీపీ దేశం బాధ్యత వహించదు. ఏబీపీ న్యూస్ ఎవరికీ పలానా చోట డబ్బు ఇన్వెస్ట్ చేయాలని చెప్పదు.
Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి
SIP Investment Mistakes: SIPలో లక్షల నష్టానికి కారణమయ్యే 7 అతిపెద్ద తప్పులు!
Long Term Investing : స్టాక్స్లో లక్ష పెట్టిన తండ్రి.. 80 కోట్లు జాక్ పాట్ కొట్టిన కొడుకు, రియల్ లైఫ్ లక్కీ భాస్కర్!
Mutual Funds: మిమ్మల్ని కోటీశ్వరులను చేసే మ్యూచువల్ ఫండ్స్ ఇవే!
Best Mutual Fund SIP: పదేళ్లలో లక్షాధికారి అయ్యే మార్గం SIPతో సులభం- 44 లక్షలు మీవే!
Operation Sindoor 2.0: ఢిల్లీ కారు బాంబు పేలుడుతో ట్రెండింగ్లో ఆపరేషన్ సింధూర్ 2.0
Hyderabad is on high alert: ఢిల్లీ పేలుడు ఘటనతో హైదరాబాద్‌లో హై అలర్ట్ - ప్రజలకు కీలక సూచనలు చేసిన పోలీసులు
Delhi Bomb Blast News: ఢిల్లీ కారు పేలుడుపై ప్రధానమంత్రి మోదీ తొలి ప్రకటన ఇదే!
Delhi Blast: ఢిల్లీలో పేలుడు విద్రోహక చర్య? ప్రమాదమా?