New Karizma 250: యూత్ అయితేనే ఈ బండి ఎక్కండి, లేదంటే దీని పవర్‌కు తట్టుకోలేరు!
Hero Karizma Updated Version: హీరో కరిజ్మా XMR 250, XMR 210 కంటే కొత్త లుక్ & డిజైన్‌తో రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ కొత్త బైక్ ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం.

Hero Karizma XMR 250 Vs Karizma XMR 210: ఇండియన్ మోటార్ సైకిల్ మార్కెట్‌లో మేటి కంపెనీ హీరో మోటోకార్ప్, స్పోర్ట్స్ సెగ్మెంట్‌లోనూ బలం తాను విన్నర్ అని నిరూపించుకోవడానికి గ్రౌండ్ సిద్ధం చేసుకుంటోంది. మొదట కరిజ్మా XMR 210తో ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు EICMA 2024లో ఆవిష్కరించిన కరిజ్మా XMR 250తో ఈ బైక్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
XMR 250 మోడల్‌ను చూస్తే, XMR 210 మోడల్ కంటే శక్తివంతమైన అప్‌గ్రేడ్ మాత్రమే కాదు; డిజైన్, పనితీరు & ట్రాక్ కేపబిలిటీ పరంగా కూడా చాలా అప్‌డేటెడ్‌గా ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ రెండు బైక్‌లలో తేడాలు, ఫీచర్లు & ఏది ఎంచుకుంటే బాగుంటుందో చూద్దాం.
చిటికెలో 60 కి.మీ. వేగం
హీరో కరిజ్మా XMR 210 మోడల్ 210cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో పని చేస్తుంది; దాదాపు 25.5 bhp & 20.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త XMR 250 250cc ఇంజిన్‌తో లాంచ్ కానుంది. ఇది 30 bhp & 25 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ బండి ఇంజిన్‌కు బలమైన 6-స్పీడ్ గేర్ బాక్స్ కనెక్ట్ అయి ఉంది (ఇది హీరో కొత్త ఎక్స్‌ట్రీమ్ 250R లోనూ కనిపిస్తుంది). దీని అర్థం కరిజ్మా XMR 250 పవర్ డెలివరీ & టాప్ స్పీడ్ రెండూ XMR 210 కంటే మెరుగ్గా ఉంటాయి. XMR 250 కేవలం 3.25 సెకన్లలో 0-60 kmph వేగాన్ని అందుకుంటుందని హీరో మోటోకార్ప్ పేర్కొంది. అంటే, మీరు చెయ్యి పైకెత్తి చిటికె వేసే టైమ్‌లో ఈ బండి స్పీడో మీటర్ ముల్లు 60 మీద కనిపిస్తుంది.
డిజైన్ & ఏరోడైనమిక్స్
XMR 210 ఇప్పటికే స్పోర్టీ ఫుల్-ఫెయిర్డ్ డిజైన్‌తో వచ్చింది. XMR 250 స్టైలింగ్ మరింత అగ్రెసివ్‌గా & రేస్-ఇన్‌స్పిరేషన్‌తో ఉంది. స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్స్, షార్ప్ వింగ్‌లెట్స్ & ఇంప్రూవ్డ్ ఫెయిరింగ్ డిజైన్ దీనికి సూపర్‌బైక్ లాంటి లుక్ ఇస్తోంది. XMR 250లో రైడింగ్ పొజిషన్ కొంచెం స్పోర్టియర్‌గా ఉండవచ్చు. 210లో ఇది రోడ్ కమ్ రేసింగ్ పొజిషన్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. XMR 250 ట్రాక్ పెర్ఫార్మెన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ల్యాప్ టైమర్ వంటి ఫీచర్లను యాడ్ చేశారు.
LED స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, వింగ్‌లెట్స్, ల్యాప్ టైమర్, 3 సెకన్లలో 60 కి.మీ. పికప్ వంటివి XMR 250 మోడల్‌ను పవర్‌ఫుల్ బైక్‌గా చూపించడమే కాకుండా, స్టైల్ & పనితీరులో XMR 210 కంటే చాలా ముందు నిలబెడుతుంది.
XMR 250 ధర ఎంత ఉంటుంది?
దిల్లీలో, హీరో కరిజ్మా XMR 210 ధర ఎక్స్ షోరూమ్ ధర దాదాపు రూ. 1.79 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, XMR 250 ఎక్స్ షోరూమ్ ధర (Karizma XMR 250 Ex-showroom Price, Delhi) రూ. 2 లక్షలు ఉండవచ్చని అంచనా. XMR 250 లాంచ్‌కు అధికారిక తేదీని ఇంకా ప్రకటించ లేదు. అయితే, ఇది మే 2025 చివరిలో లేదా జూన్ ప్రారంభంలో మార్కెట్లోకి విడుదల కావచ్చని భావిస్తున్నారు.





















