Social Justice : జనాలు డిప్రెషన్తోనే నిద్ర లేస్తున్నారట.. కారణాలు చెప్తున్న కొత్త అధ్యయనం
Human Psychology : డిప్రెషన్లో ఉండడమే కాదు.. జనాలు నిద్ర లేస్తుంటే కూడా ఏదో నిరాశతో ఉంటున్నారని తాజా అధ్యయనం తెలిపింది. పైగా ఇది మగవారిలో, ఆడవారిలో డిఫరెంట్గా ఉందని తెలిపింది.
Study on Woke Culture : నిద్రలేచిన వెంటనే పాజిటివ్ ఆలోచనలు తెచ్చుకోవాలని అంటారు కానీ. జెనరేషన్ మారింది. అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా? ఇప్పుడు నిద్ర లేచి వెళ్లాల్సిందేనా? అసలు ఎందుకు నిద్రలేచానో అనే ఆలోచనలతో నిద్ర లేస్తున్నారట. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమిటంటే.. నిద్ర లేచినందుకు సంతోషపడడం కాదు.. ఈ రోజు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని నిరాశ పడిపోతున్నారని కొత్త అధ్యయనం సూచిస్తుంది.
నమ్మలేని నిజాలు
దాదాపు అన్ని అధ్యయనాలు ఫిజికల్ హెల్త్, కొత్త కొత్త ఈవెంట్స్, వివిధ రకాల పరిస్థితులపై చేస్తూ ఉంటారు. అయితే కొందరు మానసిక పరిస్థితులపై స్టడీలు చేస్తారు. నిజం ఏంటంటే ఇలాంటి అధ్యయనాల్లో మనం నమ్మలేని నిజాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఫిన్లాండ్లోని మానసిక పరిశోధకులు.. సామాజిక న్యాయం, వాటి నిబద్ధతను కొలవడానికి ఓ అధ్యయనం చేశారు. బయటి పరిస్థితుల ప్రభావం మనుషులపై ఎలాంటి ఎఫెక్ట్లు చూపిస్తుందనే దానిపై అధ్యయనం చేసి ఆశ్చర్యకరమైన విషయాలు కనుగొన్నారు. వాటిని స్కాండినేవియన్ జర్నల్ ఆఫ్ సైకాలజీలో ప్రచురించారు. పాశ్యాత్య దేశాలు కూడా తమ పౌరులలోని భయాలను కూడా గుర్తించాలని దీనిలో సూచించారు.
క్రిటికల్ సోషల్ జస్టిస్..
ఈ స్టడీలో వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ వైఖరి కలిగిన 5000 వేలమంది పాల్గొన్నారు. నిద్రలేచిన వెంటనే తమ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై వారు చెప్పిన ఆన్సర్లకు పరిశోధకులు ఆశ్చర్యయారు. నిద్ర లేచిన తర్వాత వారి క్రిటికల్ సోషల్ జస్టిస్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో.. అది వారిని రియాలిటీలోకి ఎలా తోస్తుంది అనే విషయాలు వారు వెల్లడించారు. అక్కడి సామాజిక పరిస్థితులు వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలిపారు.
జాత్యహంకారం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. నల్లజాతీయులు కంటే శ్వేతజాతీయులు అధిక స్థాయిలో ఆదాయాన్ని కలిగి ఉండడం వల్ల వారిలో జాత్యహంకారం వస్తుందని కొందరు చెప్పగా.. కళాశాలలో నల్లజాతీయులను ఒకతీరుగా.. శ్వేతజాతీయులను మరో రకంగా చూస్తున్నట్లు కొందరు వాపోయారు. మహిళల హక్కులకు మహిళలే సహాయం చేయట్లేదని మరికొందరు నిట్టూర్చారు. స్కిన్ టోన్, బాడీ గురించి ఎక్కువ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎంత టాలెంట్ మనకి ఉన్నా మనల్ని ఎప్పుడూ చీప్గానే చూస్తారని మరికొందరు తమ అభిప్రాయాలు బయటపెట్టారు. అతి కొద్ది మాత్రమే సానుకూలమైన ఆలోచనలతో రోజు ప్రారంభిస్తున్నట్లు గుర్తించారు.
సానుకూల ఆలోచనలు కరువైపోయాయట
ఐదుగురు స్త్రీలలో ముగ్గురు సానుకూలమైన ఆలోచనలతో నిద్ర లేస్తుంటే.. ఏడుగురు మగవారిలో ఒకరు మాత్రమే పాజిటివ్గా ఆలోచిస్తున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. విద్య, మానవీయ, సాంఘిక శాస్త్రాల్లో మహిళలో ఆలోచన వేరుగా ఉంటుందని వారు తెలిపారు. అయినా మానసిక ఆరోగ్యమైనది స్త్రీ, పురుషులకు ఇద్దరికీ అవసరమేనని చెప్తున్నారు. కొన్ని రకాల నిరాశలు, మన చేతుల్లో లేని వాటి గురించి ఎక్కువ ఆలోచించి.. ఆరోగ్యాన్ని పాడుచేసుకోకూడదు అంటున్నారు. కేవలం తాము స్టడీ చేసిన దేశాల్లోనే కాకుండా.. వివిధ దేశాల్లో కూడా ఇలాంటి పరిశోధనలు చేయాలని ప్రొఫెసర్ లాహ్టినెన్ తెలిపారు. చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం.. కొందరిని నిరాశలోకి తీసుకెళ్లిపోతుందని.. నిద్ర లేస్తే ఏమి ఫేస్ చేయాల్సి వస్తుందోననే భయంతో ఉంటున్నట్లు వెల్లడించారు. ఓ రకంగా ఆలోచిస్తే అన్ని దేశాల్లో పరిస్థితి ఇలాగే ఉంటుందేమో అని మీకు కూడా అనిపిస్తుంది కదా.
Also Read : సమ్మర్ అని కూల్డ్రింక్స్ తాగేస్తున్నారా? అయితే జాగ్రత్త గుండెపోటు రావొచ్చట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.