Trisha Krishnan: 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో సౌత్ క్వీన్ లుక్ చూశారా... అజిత్ - త్రిష కాంబోలో డబుల్ హ్యాట్రిక్
Trisha First Look - Good Bad Ugly: కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఇందులో త్రిష హీరోయిన్. ఈ రోజు ఆవిడ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

తమిళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ హిట్ జోడిలలో స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar), సౌత్ క్వీన్ త్రిష (Trisha Krishnan) జంట ఒకటి. వీళ్ళిద్దరూ నటిస్తున్న తాజా సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly Movie). ఇందులో త్రిష ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు.
రమ్య పాత్రలో నటిస్తున్న సౌత్ క్వీన్ త్రిష
Trisha character name in Good Bad Ugly: 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో రమ్య పాత్రలో సౌత్ క్వీన్ త్రిష నటిస్తున్నట్లు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటి అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈరోజు అనౌన్స్ చేసింది. అంతే కాదు ఆవిడ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలోకి స్వాగతిస్తూ వీడియో రిలీజ్ చేసింది.
అజిత్ - త్రిష కాంబోలో డబుల్ హ్యాట్రిక్ సినిమా!
Ajith and Trisha Movies: ఇప్పటి వరకు ఐదు సినిమాలలో అజిత్ కుమార్ - త్రిష జంటగా నటించారు. ఇది వాళ్ళ కాంబోలో డబల్ హ్యాట్రిక్ సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. వీళ్ళిద్దరూ నటించిన 'గ్యాంబ్లర్' (తమిళంలో 'మంకత్తా') తెలుగులో కూడా భారీ విజయం సాధించింది. అలాగే గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన 'ఎంత వాడు గాని' (తమిళంలో 'ఎన్నై ఆరిందాల్') కూడా తెలుగులో సూపర్ హిట్. అంతకు ముందు 'కిరీదం', 'జి', ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'విడా ముయర్చి' సినిమాలలో నటించారు. అయితే... 'విడా ముయర్చి' ప్లాప్ కావడంతో, ఈ సినిమాతో భారీ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also Read: ప్రదీప్ రంగనాథన్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' హీరోయిన్ కయాదు లోహర్ ఫోటోలు - గ్లామర్ స్పెషల్
The ever charming @trishtrashers as #Ramya from the world of #GoodBadUgly ✨#GoodBadUgly grand release on 10th April, 2025 with VERA LEVEL entertainment ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) February 22, 2025
#AjithKumar @MythriOfficial @Adhikravi @AbinandhanR @editorvijay @suneeltollywood… pic.twitter.com/SvlWX48YQU
ఏప్రిల్ 10న థియేటర్లలో 'గుడ్ మ్యాడ్ అగ్లీ' భారీ రిలీజ్!
Good Bad Ugly Release Date: 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాకు అధిక రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వరకు తమిళంలో ఆయన నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'త్రిష ఇలియానా నయనతార' సినిమాతో దర్శకుడుగా పరిచయమైన ఆధిక్ రవిచంద్రన్... రెండేళ్ల క్రితం విశాల్, ఎస్ జె సూర్య నటించిన 'మార్క్ ఆంటోనీ'తో భారీ విజయం అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ తమిళ చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెడుతోంది. టి సిరీస్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.
Also Read: 'యుగానికి ఒక్కడు' రీ రిలీజ్... థియేటర్లలో విడుదలైన 15 ఏళ్లకు మళ్లీ భారీ ఎత్తున





















