KVS Recruitment: కేంద్రీయ విద్యాలయాల్లో 6,990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు - పూర్తి వివరాలు
ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారభంకానుంది. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 26లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 6990 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారభంకానుంది. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 26లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
పోస్టుల వివరాలు...
* మొత్తం ఖాళీల సంఖ్య: 6,990
1) అసిస్టెంట్ కమిషనర్: 52 పోస్టులు
2) ప్రిన్సిపాల్: 239 పోస్టులు
3) వైస్ ప్రిన్సిపాల్: 203 పోస్టుల
4) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ): 1409 పోస్టులు
5) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ): 3176 పోస్టులు
6) లైబ్రేరియన్: 355 పోస్టులు
7) ప్రైమరీ టీచర్ (మ్యూజిక్): 303 పోస్టులు
8) ఫైనాన్స్ ఆఫీసర్: 06 పోస్టులు
9) అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్): 02 పోస్టులు
10) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్‌వో): 156 పోస్టులు
11) హిందీ ట్రాన్స్‌లేటర్ (హెచ్‌టీ): 11 పోస్టులు
12) సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్ఎస్ఏ-యూడీసీ): 322 పోస్టులు
13) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జేఎస్ఏ-ఎల్‌డీసీ): 702 పోస్టులు
14) స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 54 పోస్టులు
అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పేపర్-2 అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి: స్టెనోగ్రాఫర్, జేఎస్ఏ పోస్టులకు 27 సంవత్సరాలు; ఎస్ఎస్ఏ, పీఆర్టీ పోస్టులకు 30 సంవత్సరాలు; హెచ్‌టీ, ఏఎస్‌వో, ఏఈ, ఎఫ్‌వో, లైబ్రేరియన్, టీజీటీ పోస్టులకు 35 సంవత్సరాలు; అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్ పోస్టులకు 50 సంవత్సరాలు; వైస్ ప్రిన్సిపాల్ పోస్టులకు 45 సంవత్సరాలు, పీజీటీ పోస్టులకు 40 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్.
దరఖాస్తు ఫీజు:
➥ అసిస్టెంట్ కమిషన్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్- రూ.2300;
➥ పీఆర్‌టీ, టీజీటీ, పీజీటీ, ఫైనాన్స్ ఆఫీసర్, ఏఈ, లైబ్రేరియన్, ఏఎస్‌వో, హెచ్‌టీ- రూ.1500;
➥ ఎస్‌ఎస్‌ఏ, స్టెనో, జేఎస్‌ఏ- రూ.1200.
➥ ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.12.2022.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022.
➥ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.
సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఖాళీలు, వివరాలు ఇలా!
బిలాస్‌పూర్ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1532 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 29న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, డిసెంబరు 19 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ ఉద్యోగాల భర్తీకి నవంబరు 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 15 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...