VJ Sunny New Movie : వీజే సన్నీ కొత్త సినిమా - సింగిల్ షెడ్యూల్‌లో...
'ఏటీయం' వెబ్ సిరీస్ తో విజయం అందుకున్న 'బిగ్ బాస్' ఫేమ్, యువ హీరో వీజే సన్నీ కొత్త సినిమా ప్రారంభమైంది. దీనిని సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేశారు.

'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లలో బిజీగా ఉంటున్న తారల్లో వీజే సన్నీ (VJ Sunny) ఒకరు. ఆయన హీరోగా నటించిన 'ఏటీయం' వెబ్ సిరీస్ ఈ మధ్య ఓటీటీలో విడుదలైంది. దానికి మంచి స్పందన లభించింది. సప్తగిరితో కలిసి 'అన్‌స్టాపబుల్' సినిమా చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందునుతోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustad Bhagat Singh Movie) లో ఓ క్యారెక్టర్ చేసే అవకాశం అందుకున్నారు. ఇప్పుడు హీరోగా మరో కొత్త సినిమా స్టార్ట్ చేశారు.
'పేపర్ బాయ్' జయశంకర్ దర్శకత్వ పర్యవేక్షణలో...
తెలుగు ప్రేక్షకులకు వినోద ప్రధానమైన చిత్రాలు అందించాలన్న సంకల్పంతో, అభిరుచితో అమెరికాలోని టెక్సాస్ (Texas)కు చెందిన ఎన్నారై రవి పోలిశెట్టి 'ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్' నిర్మాణ సంస్థ స్థాపించారు. తొలి ప్రయత్నంగా వీజే సన్నీతో సినిమా నిర్మిస్తున్నారు.
VJ Sunny New Movie : వీజే సన్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పోలిశెట్టి నిర్మిస్తున్న సినిమా ద్వారా సంజయ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇంతకు ముందు ఆయన కొన్ని సినిమాలకు రచయితగా పని చేశారు. ఈ చిత్రానికి 'పేపర్ బాయ్' సినిమాతో ప్రేక్షకుల మన్ననలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ జయశంకర్ దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరించనున్నారు. గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమా ప్రారంభమైంది.
సింగిల్ షెడ్యూల్...
స్టార్టింగ్ టు ఎండింగ్!
ఫిబ్రవరి 9... గురువారం సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఎటువంటి బ్రేకులు లేకుండా సింగిల్ షెడ్యూల్ లో సినిమా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ అధినేత రవి పోలిశెట్టి (Ravi Polishetty) మాట్లాడుతూ ''వినోదాత్మక చిత్రమిది. స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉంటుంది. మా హీరో వీజే సన్నీ క్యారెక్టర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్రతిభావంతులైన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు మా చిత్రానికి పని చేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం. మా సినిమా కోసం హంట్ ఫర్ మింట్ (Hunt4Mint) ప్లాట్‌ఫారమ్ ద్వారా కొంత మందిని తీసుకుంటున్నాం. అందులో కళాకారులు, సాంకేతిక నిపుణులు చాలా మంది ఉన్నారు'' అని చెప్పారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ సంస్థలో వరుసగా సినిమాలు నిర్మిస్తామని తెలిపారు.
Also Read : నారా, నందమూరి కుటుంబాలకు ఎన్టీఆర్ దూరమా? చెక్ పెట్టిన బ్రాహ్మణి, ప్రణతి
'అన్‌స్టాపబుల్', 'ఉస్తాద్ భగత్ సింగ్', ఇప్పుడీ కొత్త సినిమా కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. 'ఏటీఎం' వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ చేయడానికి కూడా సన్నీ రెడీ అవుతున్నారు.
వీజే సన్నీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శివన్నారాయణ, శైలజ ప్రియ, సప్తగిరి, రేఖ ఇతర తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకత్వం : రాజీవ్ నాయర్, ఛాయాగ్రహణం : శ్రీనివాస్ రెడ్డి, కూర్పు : కార్తీక్ శ్రీనివాస్, సంగీతం : మదీన్, నిర్మాణం: ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్, దర్శకత్వ పర్యవేక్ష : వి. జయశంకర్, నిర్మాత : రవి పోలిశెట్టి, రచన - దర్శకత్వం : సంజయ్.
Also Read : 'అమిగోస్' రివ్యూ : నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

