Prince Movie Update, Sunny Leone Naach Baby Song : కొత్త పాటలు, కబుర్లతో వచ్చిన శృంగార తార సన్నీ లియోన్, శివ కార్తికేయన్, కృతి శెట్టి, 'బిగ్ బాస్' సోహైల్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? లేటెస్ట్ న్యూస్, గాసిప్స్, అప్‌డేట్స్‌ను ABP Desam లైవ్ పేజీ ద్వారా మీ ముందుకు తీసుకు వస్తోంది.
LIVE

Background
'ప్రిన్స్' ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
Sivakarthikeyan and Anudeep KV's Prince Movie First Single On September 1st : శివ కార్తికేయన్ హీరోగా 'జాతి రత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ప్రిన్స్'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సునీల్ నారంగ్ (నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో), డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తొలి పాటను సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నట్లు ఈ రోజు వెల్లడించారు. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
View this post on Instagram
కొత్త పాటతో సన్నీ లియోన్ రెడీ - చూడటానికి మీరు రెడీనా?
Sunny Leone's Naach Baby Musical Video To Release On September 6th : శృంగార తార సన్నీ లియోన్ కొత్త పాటతో రెడీ అయ్యారు. 'నాచ్ బేబీ' అంటూ సాగే ఆ గీతంలో రేమో డిసౌజాతో కలిసి స్టెప్పులు వేశారు. ఈ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఈ రోజు ఆ సాంగ్ పోస్టర్ విడుదల చేశారు.
View this post on Instagram
మోనికా డార్లింగ్.... నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్ టీజర్ వచ్చిందోచ్
Monica O My Darling Teaser Out Now : రాజ్ కుమార్ రావు, హ్యుమా ఖురేషి, రాధికా ఆప్టే, ఆకాంక్షా రంజన్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మోనికా ఓ మై డార్లింగ్'. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం రూపొందించారు. త్వరలో విడుదల కానుంది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. అంగోలా అనే స్మాల్ టౌన్ నుంచి వచ్చిన ఓ హీరో, ముగ్గురు మహిళలతో పరిచయం ఎలా ఏర్పడింది? అనేది కథగా తెలుస్తోంది.
కృతి శెట్టిలో ఆ మెరుపేమిటో చూశారా?
Here Is Aa Merupemito song from Aa Ammayi Gurinchi Meeku Cheppali starring Sudheer Babu and Krithi Shetty : సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని 'ఆ మెరుపేమిటో' పాటను ఈ రోజు విడుదల చేశారు. వివేక్ సాగర్ సంగీతం అందించగా... 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మహేంద్ర, కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 16న ఈ సినిమా (Aa Ammayi Gurinchi Meeku Cheppali Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది.
బిగ్ బాస్' సోహైల్ సినిమా 'లక్కీ లక్ష్మణ్'లో కొత్త పాట చూశారా?
Oo Meri Jaan Song From Bigg Boss Sohel's 'Lucky Lakshman' movie unveiled : 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోహైల్ హీరోగా నటిస్తున్న సినిమా 'లక్కీ లక్ష్మన్'. దత్తాత్రేయ మీడియా పతాకంపై ఎ.ఆర్ అభి దర్శకత్వంలో, హరిత గోగినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మోక్ష హీరోయిన్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... ఈ సినిమాలో 'ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే...' సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఫుల్ సాంగ్ సెప్టెంబర్ 3న విడుదల కానుంది. అనూప్ రూబెన్స్ సంగీతంలో భాస్కరభట్ల రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

