Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్
Chiranjeevi Interview: అమ్మ అంజనాదేవి తనకు కొండంత ధైర్యాన్ని, పాజిటివిటీని ఇచ్చారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 'వుమెన్స్ డే' సందర్భంగా మెగా ఫ్యామిలీ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Megastar Chiranjeevi's Shares Childhood Experiences With His Family In Special Interview: తన తల్లి అంజనాదేవికి తన కంటే తమ్ముడు నాగబాబు అంటేనే చాలా ఇష్టమని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అన్నారు. 'వుమెన్స్ డే' సందర్భంగా 'మెగా వుమెన్' (Mega Woman) పేరుతో చేసిన ఇంటర్వ్యూలో తన తల్లి అంజనాదేవి, సోదరుడు నాగబాబు, సోదరీమణులు విజయదుర్గ, మాధవిలతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా తన చిన్నప్పటి విషయాల నుంచి అమ్మ ఇచ్చిన ధైర్యం, నచ్చిన ఫుఢ్ ఇలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. చిరంజీవినే ఎక్కువ అల్లరి చేసే వాడని అంజనమ్మ చెప్పగా.. 'అమ్మా.. నేను అల్లరోడిని కాదు. హుషారుగా ఉంటాను.' అని చిరంజీవి సరదాగా అన్నారు. చలాకీతనాన్నే అమ్మ అల్లరి అనుకుంటారని చెప్పారు. ఈ సందర్భంగా చిన్నప్పుడు జరిగిన ఓ సరదా సంఘటనను మెగాస్టార్ షేర్ చేసుకున్నారు.
'చిన్నప్పుడు నేను ఎక్కడికో పాక్కుంటూ వెళ్లిపోయి ఒళ్లంతా మసి పూసుకుని కూర్చున్నా. ఈ పిల్లాడు ఎవరు.? అని అంతా అనుకున్నారు. మా అమ్మ నన్ను చూసి కూడా గుర్తుపట్టలేదు. చిరంజీవి ఎక్కడున్నాడో అంటూ నన్ను వెత్కుకుంటూ ఉంది. మళ్లీ ఎందుకో వెనక్కి వచ్చి చూసి నన్ను ఎత్తుకున్నారు.' అంటూ చెబుతూ ఒక్కసారిగా నవ్వులు పూయించారు. నాగబాబు, సోదరీమణలు సైతం అమ్మతో తమకున్న అనుబంధాన్ని, ఆమె ఇచ్చిన పాజిటివిటీని షేర్ చేసుకున్నారు.
'ఆ క్షణం ఇప్పటికీ గుర్తు'
ఈ సందర్భంగా తన చెల్లి చనిపోయిన క్షణాన్ని మెగాస్టార్ గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. 'అమ్మకు మేము ఐదుగురు సంతానం. మరో ముగ్గురు తోబుట్టువులు నా చిన్నతనంలోనే చనిపోయారు. నేను ఆరో తరగతి చదివే సమయంలో రమ అనే సోదరి సడన్‌గా జబ్బు పడితే అమ్మ, నేను ఆస్పత్రికి తీసుకెళ్లాం. నాన్నకు ఈ విషయం తెలియదు. అక్కడ ఆమె కన్నుమూయగా తనను చేతుల్లోకి ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాను. ఇంటి చుట్టుపక్కల వారు సాయం చేయడంతో రమ అంత్యక్రియలు పూర్తి చేశాం. ఆ తర్వాత విషయం నాన్నకు తెలిసింది. తాను వచ్చే వరకూ అంతా అయిపోయింది. ఆ క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.' అంటూ చిరంజీవి ఎమోషన్ అయ్యారు.
'ఆమె సలహాల వల్లే ఈ స్థాయిలో ఉన్నాం'
అమ్మ అంజనమ్మ సలహాల వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని మెగాస్టార్ చిరంజీవి సోదరీమణులు విజయదుర్గ, మాధవి అన్నారు. 'జీవితంలో ఎల్లపుడూ ధైర్యంగా ఉండాలి.. ఎవరి మీదా ఆధారపడొద్దు..' అనే ధైర్యాన్ని అమ్మ తనకు నేర్పిందని విజయదుర్గ చెప్పారు. అన్నయ్య వాళ్లు దూరంగా ఉండడంతో అమ్మకు అన్నీ పనులు నేనే చేసేదాన్నంటూ చెప్పుకొచ్చారు. తాను డిప్రెషన్‌లోకి వెళ్లినప్పుడు అమ్మే కొండంత ధైర్యాన్ని ఇచ్చారని చిరంజీవి మరో సోదరి మాధవి వెల్లడించారు. ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ కావొద్దని చెప్పేవారని.. తన కోసం అమ్మ భరోసా ఎప్పుడూ ఉంటుందని నమ్మకాన్ని కలిగించారని అన్నారు.
'ముగ్గురిలో నేనే వయలెంట్'
ఎంతటి ఒత్తిడికి గురైనా.. ఏ కష్టం వచ్చినా అమ్మకు హగ్ ఇస్తే చాలని.. ఎంతటి కష్టమైనా వెళ్లిపోతుందని చిరంజీవి సోదరుడు నాగబాబు అన్నారు. 'ముగ్గురిలో నేనే కాస్త వయలెంట్. ఇంట్లో భోజనం నచ్చకుంటే పెద్ద గొడవ చేసేవాడిని. అన్నయ్య మాత్రం ఏది పెడితే అది సైలెంట్‌గా తినేవాడు. కల్యాణ్ బాబు మాత్రం భోజనం నచ్చకుంటే సైలెంట్‌గా వెళ్లేవాడు. ఎవ్వరినీ ఏ మాటా అనకుండా సైలెంట్‌గానే తన నిరసన తెలిపేవాడు.' అంటూ సరదాగా చెప్పారు నాగబాబు. ఇలా మెగా ఫ్యామిలీ పలు ఆసక్తికర విషయాలను వుమెన్స్ డే సందర్బంగా పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ మిస్ అయ్యారు.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 7, 2025
నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ
మహిళా దినోత్సవ ♀ శుభాకాంక్షలు. 💐🙏#HappyWomensDay pic.twitter.com/j5qtSrtIAC
మరోవైపు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రత్యేకమైన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన సతీమణి సురేఖతో పాటు తనతో నటించిన హీరోయిన్లతో దిగిన ఫోటోను షేర్ చేశారు. 'నా నిజ జీవితాన్ని, సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులెత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

