అన్వేషించండి

Thunivu / Thegimpu Review : 'తెగింపు'లో 'సర్కారు వారి పాట'? ఫస్టాఫ్‌లో అజిత్ స్క్రీన్‌ స్పేస్‌ తక్కువే కానీ - సినిమా ఎలా ఉందంటే?

Thunivu Twitter Review : సంక్రాంతి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో నేడు అజిత్ 'తెగింపు' సినిమా విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు? ఈ ట్విట్టర్ రివ్యూ చూస్తే...

తమిళ చిత్రసీమలోని అగ్ర కథానాయకులలో అజిత్ (Ajith) ఒకరు. ఆయనకు మన తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. డబ్బింగ్ సినిమాలతో ఏపీ, తెలంగాణ ప్రేక్షకులకు ఆయన దగ్గర అయ్యారు. ఇప్పుడీ సంక్రాంతికి కొత్త సినిమా 'తునివు' (Thunivu Movie)తో సందడి చేయడానికి రెడీ అయ్యారు. తెలుగులో ఈ సినిమా 'తెగింపు'గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సంక్రాంతి బరిలో విడుదలైన తొలి చిత్రమిదే. నేడు తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున థియేటర్లలోకి వచ్చింది. ఆల్రెడీ తమిళనాడులో ఎర్లీ మార్నింగ్ షోలు పడ్డాయి. అమెరికాలో ప్రీమియర్స్ వేశారు. మరి, అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు ఏం అంటున్నారంటే? 

Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?  

Thegimpu Twitter Review : 'తెగింపు' చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ తమ అభిప్రాయాలను ఏ విధంగా వ్యక్తం చేశారో చూడండి. 

ఫస్టాఫ్‌లో అజిత్‌ స్క్రీన్‌ స్పేస్‌ తక్కువే కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని చాలా మంది ట్వీట్లు చేశారు. సెకండాఫ్ చూస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు లాస్ట్ సినిమా 'సర్కారు వారి పాట' గుర్తుకు వస్తుందని ఓ నెటిజన్ పేర్కొన్నారు. డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ అని కొందరు చెబుతున్నారు. ఓవరాల్ రిపోర్ట్ చూస్తే...

Also Read : 'వారసుడు' వాయిదా వేసినా... పవర్ చూపించిన 'దిల్' రాజు  

'తెగింపు' చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. కార్తీ హీరోగా నటించిన 'ఖాకీ' ఉంది కదా! ఆ సినిమాకు దర్శకత్వం వహించినది ఆయనే. అజిత్, వినోద్ కలయికలో 'తెగింపు' హ్యాట్రిక్ సినిమా. దీని కంటే ముందు హిందీ హిట్ 'పింక్' తమిళ రీమేక్ 'నేర్కొండ పార్వై', 'వలిమై' చేశారు. ఈ సినిమాలో మలయాళ కథానాయిక మంజూ వారియర్ నటించారు. సముద్రఖని పోలీస్ అధికారిగా కీలక పాత్ర పోషించారు. 

'తెగింపు' సినిమాను బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. 'రన్ రాజా రన్', 'జిల్' సినిమా పాటలు, 'సాహో' నేపథ్య సంగీతంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన జిబ్రాన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఐవీవై ప్రొడక్షన్ సంయుక్తంగా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. 

ట్రైలర్ అంతా యాక్షనే!'తెగింపు' ట్రైలర్ విషయానికి వస్తే... ఫుల్ యాక్షన్ ఫీస్ట్ అన్నట్టు ఉంది. బ్యాంకులో దోపిడి చేయడానికి వచ్చిన ఓ ముఠాకు నాయకుడిగా అజిత్ కనిపించారు. ట్రైలర్ ఎండింగ్ వచ్చే సరికి పోలీస్ అని రివీల్ చేశారు. హీరో పోలీస్ అయితే బ్యాంకులో ఎందుకు దోపిడీ చేయాలని అనుకున్నాడు? అనేది సస్పెన్స్. అజిత్ క్యారెక్టర్ విషయానికి వస్తే... ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసినట్లు స్పష్టం అవుతోంది. 

విలన్ టైపులో అజిత్ యాక్ట్ చేసిన ప్రతిసారీ సూపర్ డూపర్ సక్సెస్ ఆయన సొంతం అయ్యింది. ఇప్పుడు కాదు... 'వాలి' నుంచి 'గ్యాంబ్లర్', 'వలిమై' వరకు ఆయనకు హిట్స్ వచ్చాయి. మరి, 'తెగింపు' ఏం అవుతుందో చూడాలి.   

'తెగింపు' విడుదలకు ముందు సినిమాకు సంబంధించిన భారీ పోస్టర్ గాలిలో ఎగరేస్తూ... ప్రేక్షకులు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేలా ప్రచారం చేశారు. స్కై డైవింగ్ ద్వారా కొందరు చేసిన ఆ ప్రయత్నాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి కారణం అభిమానుల మధ్య పోటీ. తమిళనాడులో అజిత్ 'తునివు', విజయ్ 'వారిసు' ఒకే రోజు విడుదల అవుతున్నాయి. దాంతో అభిమానుల మధ్య పోటీ నెలకొంది. తమ హీరో సినిమా హిట్ అంటే తమ హీరో సినిమా హిట్ అంటూ సోషల్ మీడియాలో ఫైట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరి సినిమాకు ఎన్ని కలెక్షన్లు వస్తాయి? అనేదాంట్లో కూడా పోటీ ఉంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget