By: ABP Desam | Updated at : 09 Mar 2023 07:19 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Manchu Lakshmi/Instagram
సమాజంలో నిత్యం ఎక్కడోచోట ఏదొక దారుణం జరుగుతూనే ఉంటుంది. అయితే మనకు ఏదైనా సమస్య వస్తే రక్షణ కోసం పోలీసుల దగ్గరకు వెళ్తాం. అలాంటిది పోలీసులే విచక్షణ మరిచిపోయి దారుణాలకు ఒడిగడితే. కోపం కట్టలు తెంచుకుంటుంది కదా. అందులోనూ మహిళల పట్ల అలా ఎవరైనా ప్రవర్తిస్తే ఆగ్రహంతో ఊగిపోతాం. ప్రస్తుతం మంచు లక్ష్మీకు కూడా అలాగే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దానికి కారణం ఇటీవల మంచు లక్ష్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోనే. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇటీవల మంచు లక్ష్మి ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అందులో ఓ పోలీస్ అధికారి రాత్రి సమయంలో రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న ఓ అమ్మాయిని అడ్డగించాడు. ఆమెను ఆపడమే కాకుండా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె ఆ పోలీస్ నుంచి ఎంత తప్పించుకోవాలని చూసినా అతను వదల్లేదు. ఇదంతా దూరం నుంచి ఎవరో వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఆ వీడియోను చూసిన మంచు లక్ష్మి దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడమే కాకుండా ‘రక్తం మరిగిపోతోంది’ అంటూ క్యాష్షన్ కూడా ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. మహిళలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తంచడం బాధాకరం అంటూ కామెంట్లు చేస్తున్నారు. భోపాల్ లోని హనుమాన్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మంచు లక్ష్మి సోషల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పుడూ ఏదొక విషయంపై స్పందిస్తూ పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. ఇటీవలే తాను హైదరాబాద్ విమానాశ్రయంలో విమాన సిబ్బంది తనను ఇబ్బంది పెట్టారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తాను తిరుపతి నుంచి హైదరాబాద్ కు ఇండిగో విమానంలో వచ్చానని, విమానం దిగిన తర్వాత తన బ్యాగ్ ను మర్చిపోడంతో దాన్ని తెచ్చుకోవడానికి వెళ్తే విమాన సిబ్బంది అడ్డుకున్నారని చెప్పింది. ఆ సమయంలో తాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా సిబ్బంది తనని పట్టించుకోకపోవడంతో చాలా సమయం వెయిట్ చేయాల్సి వచ్చిందని ఇండిగో సర్వీస్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అయితే దానిపై ఎయిర్ లైన్స్ సంస్థ స్పందించింది. అయితే తాజాగా మంచు లక్ష్మి చేసిన ఈ పోస్ట్ కూడా వైరల్ అవుతోంది.
ఇక మంచు లక్ష్మి సినిమాల విషయానికొస్తే. గతేడాది ‘మాన్ స్టర్’ అనే మలయాళం సినిమాలో నటించింది. ఇక ఈ ఏడాది ‘అగ్ని నక్షత్రం’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు వంశీ మళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు కూడా నటిస్తున్నారు. తొలిసారి మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి కలసి నటిస్తున్న సినిమా ఇదే. ఇటీవలే ఈ సినిమా నుంచి ‘తెలుసా తెలుసా’ పాటను విడుదల చేశారు.
Blood boils https://t.co/StR428okW0
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 9, 2023
Surveen Chawla: ‘రానా నాయుడు’ బ్యూటీ సుర్వీన్ చావ్లా నటించిన తెలుగు సినిమా మీకు గుర్తుందా?
RC15 Welcome: రామ్ చరణ్‌కు RC15 టీమ్ సర్‌ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం
Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?
Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!
Newsense Teaser 2.0: న్యూస్ రాసే వాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది - నవదీప్ ‘న్యూసెన్స్’ టీజర్ అదిరిందిగా!
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు