అన్వేషించండి

Rajamouli - Mahesh Movie : బాబు కోసం ఇంటర్నేషనల్ బ్యూటీని సెట్ చేస్తున్న జక్కన్న.. ప్లాన్ మాములుగా లేదుగా!

SSMB29 : రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో ఇండోనేషియన్ హీరోయిన్ నటించనున్నట్లు సమాచారం.

Mahesha and Rajamouli Film : గత ఏడాది 'RRR' సినిమాతో పాన్ ఇండియా హిట్​ని తన ఖాతాలో వేసుకున్న దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. మొదటిసారి వీరి కాంబినేషన్​లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాల నెలకొన్నాయి. 'బాహుబలి', 'RRR' సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి మహేష్ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్​పై కన్నెశాడు. ఈ క్రమంలోనే సినిమా కోసం ఏది ప్లాన్ చేసినా అది ఇంటర్నేషనల్ రేంజ్​లో ఉండేలా చూసుకుంటున్నాడు.

ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం కొన్ని హాలీవుడ్ కంపెనీస్​తో ప్యాచప్ అయిన రాజమౌళి ఇప్పుడు మహేష్ కోసం ఇంటర్నేషనల్ హీరోయిన్ ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మహేష్ - రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా కోసం ఓ ఇండోనేషియన్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె పేరు చెల్సియా ఇస్లాన్.. ఇప్పటికే కొన్ని హాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఇదే హీరోయిన్​ని మహేష్ సినిమా కోసం రాజమౌళి రీసెంట్ గా స్క్రీన్ టెస్ట్ కూడా చేశారని, ఈ సినిమాలో ఆమె వర్క్ చేయడం దాదాపు కన్ఫార్మ్ అయిందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

అయితే ఈ ఇండోనేషియన్ బ్యూటీని రాజమౌళి హీరోయిన్ పాత్ర కోసం తీసుకున్నారా? లేదంటే సినిమాలో కీలక పాత్ర కోసం ఎంచుకున్నారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మహేష్ సినిమా కోసం ఇండోనేషియా హీరోయిన్ ని తీసుకున్నారనే విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా ఈ ప్రాజెక్టుపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. కాగా ఇప్పటికే సెట్స్​ పైకి వెళ్లాల్సిన ఈ ప్రాజెక్టు కొన్ని అనివార్య కారణాలవల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. రీసెంట్​గానే రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి చేశారని, కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి లొకేషన్స్ వేటలో ఉన్నారట. ఈ ఏడాది ఏప్రిల్​లో రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే షూటింగ్ కు ముందు రాజమౌళి ప్రత్యేక వర్క్ షాప్ ని ప్లాన్ చేయగా మహేష్ బాబు తో పాటు టీ మొత్తం కూడా ఈ వర్క్ షాప్ కోసం హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఆఫ్రికన్ అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుందని, సుమారు మూడు భాగాలుగా రాజమౌళి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ ప్రముఖ హాలీవుడ్ స్టూడియోస్​తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read : రెహమాన్‌కు వెల్కమ్ చెప్పిన రామ్ చరణ్ - అఫీషియల్‌గా చెప్పిన RC16 టీమ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Uttarandhra Teachers Mlc: కూటమి పార్టీలు మద్దతిచ్చినా రఘువర్మకు ఓటమే - ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి విజయం
కూటమి పార్టీలు మద్దతిచ్చినా రఘువర్మకు ఓటమే - ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి విజయం
MLC Results: గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫస్ట్ రౌండ్‌లో టీడీపీకి భారీ లీడ్ - ఈ ట్రెండ్ కొనసాగితే ఆలపాటి గెలుపు ఈజీనే !
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫస్ట్ రౌండ్‌లో టీడీపీకి భారీ లీడ్ - ఈ ట్రెండ్ కొనసాగితే ఆలపాటి గెలుపు ఈజీనే !
Rashmika Mandanna: 'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
YSRCP On Amaravati: 3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Oscar 2025 | 97వ ఆస్కార్‌ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన అనోరా సినిమా | ABP DeshamRaksha Khadse Daughter | తన కుమార్తెను వేధించిన పోకిరీలపై కేంద్రమంత్రి పోలీస్ కంప్లైంట్ | ABP DesamSpeaker suggests massage chairs for MLAs in Assembly | MLAలకు సభ తర్వాత విశ్రాంతి కావాలి | ABP DeshamPM Modi Lion Safari | గిర్ అభయారణ్యంలో సఫారీ కి వెళ్లిన ప్రధాని మోదీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttarandhra Teachers Mlc: కూటమి పార్టీలు మద్దతిచ్చినా రఘువర్మకు ఓటమే - ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి విజయం
కూటమి పార్టీలు మద్దతిచ్చినా రఘువర్మకు ఓటమే - ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి విజయం
MLC Results: గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫస్ట్ రౌండ్‌లో టీడీపీకి భారీ లీడ్ - ఈ ట్రెండ్ కొనసాగితే ఆలపాటి గెలుపు ఈజీనే !
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫస్ట్ రౌండ్‌లో టీడీపీకి భారీ లీడ్ - ఈ ట్రెండ్ కొనసాగితే ఆలపాటి గెలుపు ఈజీనే !
Rashmika Mandanna: 'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
YSRCP On Amaravati: 3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
Revanth Reddy: ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
Causes of Snoring : గురక ఎక్కువగా వస్తుందా? కారణాలు ఇవే.. తగ్గించుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
గురక ఎక్కువగా వస్తుందా? కారణాలు ఇవే.. తగ్గించుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
CM Chandrababu: తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
Harish Rao Challenges Revanth Reddy: SLBCపై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్
SLBC టన్నెల్ పై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్
Embed widget