AR Rahman: రెహమాన్‌కు వెల్కమ్ చెప్పిన రామ్ చరణ్ - అఫీషియల్‌గా చెప్పిన RC16 టీమ్
AR Rahman Onboard for RC16 Movie: రామ్ చరణ్ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఆ విషయాన్ని ఇవాళ అఫీషియల్‌గా చెప్పారు.
AR Rahman On Board For Ram Charan and Buchi Babu Sana movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు ఓ పాన్ ఇండియా సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఆ చిత్రానికి ఇసై పుయల్ (Isai Puyal), ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.
'నాయకుడు' (ఉదయనిధి స్టాలిన్ తమిళ సినిమా 'మామన్నన్' తెలుగు అనువాదం) విడుదల సందర్భంగా తెలుగు మీడియాతో ముచ్చటించిన రెహమాన్ సైతం 'చర్చలు జరుగుతున్నాయి' అని చెప్పారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ రోజు ఆ విషయాన్ని అధికారికంగా చెప్పారు.
రామ్ చరణ్ 16కు రెహమాన్ సంగీత దర్శకుడు
AR Rahman Birthday: ఇవాళ (జనవరి 6న) ఏఆర్ రెహమాన్ బర్త్ డే. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. అందులో ఓ పోస్టర్ ఉంది. ''హ్యాపీ బర్త్ డే ఇసై పుయల్. లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారిని మా సినిమాలోకి స్వాగతిస్తున్నాం'' అని పేర్కొన్నారు. రామ్ చరణ్ 16వ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయాన్ని ఇలా కన్ఫర్మ్ చేశారు.
Also Read: మెగాస్టార్ @ 50 కోట్లు... చిరంజీవి రెమ్యూనరేషన్ పెంచిన దిల్ రాజు!?
Happy Birthday @arrahman sir, wish you health and happiness always. pic.twitter.com/Lj6RPkIBNs
— Ram Charan (@AlwaysRamCharan) January 6, 2024
సతీష్ కిలారు నిర్మాణంలో...
రామ్ చరణ్ - సానా బుచ్చి బాబు సినిమాతో సతీష్ కిలారు (Satish Kilaru) నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వ సమర్పణలో ఆయనకు చెందిన వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. భారీ నిర్మాణ వ్యయం, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
Welcoming the 'Mozart of Madras', Academy Award winning @arrahman on board for #RC16 🥁🥁
— Vriddhi Cinemas (@vriddhicinemas) January 6, 2024
Happy Birthday 'Isai Puyal' ❤️🔥
RC 16 will have rip-roaring music score by the legend 🎶❤️🔥#RamCharanRevolts
Mega Power Star @AlwaysRamCharan @BuchiBabuSana @SukumarWritings… pic.twitter.com/dZwWLHZOMf
నటుడిగా రామ్ చరణ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన క్యారెక్టర్లలో 'రంగస్థలం' సినిమాలో చిత్తుబాబు క్యారెక్టర్ ముందు వరుసలో ఉంటుంది. దాని కంటే బెటర్ క్యారెక్టర్ అని చెప్పడంతో... ఆ ఒక్క మాటతో సినిమాపై మరింత హైప్ పెంచేశారు ఆయన. ఆ సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ (ఫారినర్స్)ను కూడా ఆకట్టుకుంటుందని రామ్ చరణ్ తెలిపారు.
Also Read: కాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?
సాధారణంగా సుకుమార్ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. అంతే కాదు... ఆయన శిష్యుల సినిమాలకూ దేవి సంగీతం అందిస్తూ వస్తున్నారు. అంత ఎందుకు? 'ఉప్పెన' సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ దర్శకుడు. అయితే... రెండో సినిమాకు రెహమాన్ తో పని చేసే అవకాశాన్ని బుచ్చిబాబు సొంతం చేసుకున్నారు.