అన్వేషించండి

Chiranjeevi: చిరంజీవి రెమ్యూనరేషన్ పెంచిన దిల్ రాజు!

Chiranjeevi Remuneration: సీనియర్ స్టార్ హీరోలు నలుగురిలో చిరంజీవి మిగతా ముగ్గురి కంటే ముందు ఉన్నారని, రెమ్యూనరేషన్ పరంగా మెగాస్టార్ కొత్త రికార్డ్ క్రియేట్ చేశారని ఇండస్ట్రీ ఖబర్.

Chiranjeevi Remuneration for Anil Ravipudi Dil Raju Movie: మెగాస్టార్ చిరంజీవి రెమ్యూనరేషన్ పరంగా సీనియర్ స్టార్ హీరోలు మిగతా ముగ్గురి కంటే ఓ అడుగు ముందు ఉన్నారని టాలీవుడ్ ఇండస్ట్రీ ఖబర్. దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమాకు ఆయన రికార్డ్ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల కథనం. పూర్తి వివరాల్లోకి వెళితే...  

కొత్త ఏడాదిలో కొత్త సినిమాలు రెండు స్టార్ట్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ఆయన హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే... ఇంకా చిరంజీవి షూటింగ్ స్టార్ట్ చేయలేదు. ఈ సినిమాకు 'విశ్వంభర' టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. అయితే... అదీ ఇంకా అనౌన్స్ చేయలేదు. 'విశ్వంభర' కోసం త్వరలో మేకప్ వేసుకోనున్నారు. ఈ సినిమాకు ఆయన రెమ్యూనరేషన్ 40 కోట్లు అని టాక్. దాని తర్వాత సినిమాతో 50 కోట్ల క్లబ్బులో చేరుతున్నారట.  

చిరంజీవి @ 50 కోట్ల క్లబ్!
Anil Ravipudi to direct Chiranjeevi: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసేందుకు 'దిల్' రాజు ప్రయత్నాలు చేస్తున్నారనేది తెలిసిన విషయమే. ఆ సినిమాకు గాను చిరుకు 50 కోట్లు ఇవ్వడానికి దిల్ రాజు రెడీ అయ్యారట.

Also Read: దేవర ఆడియో @ బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్... ఈ నలుగురిలో 50 కోట్ల క్లబ్బులో ముందుగా చేరింది మెగాస్టారే. ప్రజెంట్ బాలకృష్ణ ఒక్కో సినిమాకు రూ. 25 కోట్ల వరకు తీసుకుంటున్నారు. 'నా సామి రంగ'కు నాగార్జున 10 కోట్లు తీసుకున్నారని టాక్. వెంకటేష్ రెమ్యూనరేషన్ సైతం ఇంచుమించు 10 కోట్లకు ఇటు ఇటుగా ఉంది.

Also Read: లవర్‌కు హ్యాండ్ ఇస్తున్న 85 శాతం అమ్మాయిలు - రీసెంట్ రీసెర్చ్ గురించి 'బేబీ' హీరో విరాజ్ అశ్విన్ ఏమన్నారంటే?

'చంటబ్బాయ్' రేంజ్ స్క్రిప్ట్ రెడీ!?
అనిల్ రావిపూడి డైరెక్షన్ అనేసరికి మెగా అభిమానులు, ప్రేక్షకులు 'చంటబ్బాయ్' రేంజ్ స్క్రిప్ట్ ఆశిస్తున్నారు. చిరంజీవిలో వింటేజ్ కామెడీ టైమింగ్ బయటకు తీసే సత్తా అనిల్ రావిపూడికి ఉందని, ఆయన శైలి కామెడీకి మెగాస్టార్ తోడు అయితే భలే ఉంటుందని అనుకుంటున్నారు. మరి, అనిల్ రావిపూడి మనసులో ఏం ఉందో!?

Also Read: కాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?

మెగా హీరోలతో 'దిల్' రాజు సినిమాలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'వకీల్ సాబ్' చేశారు. అంతకు ముందు రామ్ చరణ్ హీరోగా 'ఎవడు' సినిమా చేశారు. ప్రస్తుతం ఆయనతో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నారు. అయితే... మెగాస్టార్ చిరంజీవితో ఇప్పటి వరకు 'దిల్' రాజు సినిమా చేయలేదు. ఇది తొలి సినిమా అవుతుంది. 'భగవంత్ కేసరి', 'సరిలేరు నీకెవ్వరు' మినహా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటినీ 'దిల్' రాజు నిర్మించారు. 'సరిలేరు...'లో కూడా ఆయన నిర్మాణ భాగస్వామి.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 21: కాచీ జుట్టు కాల్చేసి పార్టీ ఆపడానికి ఆదిలక్ష్మీ ప్రయత్నం వృథా...దివ్యాంకకు గట్టిగా బుద్ది చెప్పిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కాచీ జుట్టు కాల్చేసి పార్టీ ఆపడానికి ఆదిలక్ష్మీ ప్రయత్నం వృథా...దివ్యాంకకు గట్టిగా బుద్ది చెప్పిన ధాత్రి
Fauzi Glimpse: ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్ 'ఫౌజీ' గ్లింప్స్‌లో ఏముంటుంది? రివీల్ చేసిన ప్రొడ్యూసర్
ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్ 'ఫౌజీ' గ్లింప్స్‌లో ఏముంటుంది? రివీల్ చేసిన ప్రొడ్యూసర్
Rag Mayur: 'గరివిడి లక్ష్మి' జీవితంలో అసలైన విలన్... సత్తిబాబుగా కుమ్మేసిన రాగ్ మయూర్
'గరివిడి లక్ష్మి' జీవితంలో అసలైన విలన్... సత్తిబాబుగా కుమ్మేసిన రాగ్ మయూర్
Premalu 2: 'ప్రేమలు' హీరోపై డైరెక్టర్ సెటైర్లు... ఏడాది వేస్ట్ అయ్యింది... సీక్వెల్ షెడ్డుకు వెళ్ళడంపై నిరాశ
'ప్రేమలు' హీరోపై డైరెక్టర్ సెటైర్లు... ఏడాది వేస్ట్ అయ్యింది... సీక్వెల్ షెడ్డుకు వెళ్ళడంపై నిరాశ

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
Indian Railways Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
AP MPTC ZPTC Elections: పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
CM Revanth Reddy: 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Embed widget