Basil Joseph OTT Movies: 'సూక్ష్మదర్శిని' హీరో బసిల్ జోసెఫ్ లేటెస్ట్ డార్క్ కామెడీ - ఓటీటీలో మార్చి 14న స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?
OTT Malayalam Dark Comedy Movie: మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో బసిల్ జోసెఫ్. ఆయన లేటెస్ట్ సినిమా 'పొన్ మాన్' ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది.

Ponman OTT Release Date Telugu: 'పొన్ మాన్'... 'సూక్ష్మ దర్శిని' ఫేమ్ బసిల్ జోసెఫ్ నటించిన లేటెస్ట్ మలయాళం సినిమా. ఇదొక డార్క్ కామెడీ సినిమా. జనవరి 30న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడీ సినిమా వచ్చే వారం ఓటీటీలోకి రానుంది.
జియో హాట్ స్టార్ ఓటీటీలో 'పొన్ మాన్'
Ponman OTT Platform: మార్చి 14 నుంచి జియో హాట్ స్టార్ ఓటీటీలో 'పొన్ మాన్' స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను మలయాళంలో విడుదల చేస్తున్నట్లు ప్రస్తుతానికి అనౌన్స్ చేశారు. అదే తేదీకి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది.
పెళ్లి కూతురుకు నగలు అప్పు ఇవ్వడం..అసలు ఈ సినిమా కథ, కహాని ఏమిటి?డిఫరెంట్ అండ్ యూనిట్ స్టోరీతో ఈ 'పొన్ మాన్' సినిమా రూపొందింది. ఇందులో పిపి అజేష్ పాత్రలో బసిల్ జోసెఫ్ నటించారు. అతనో గోల్డ్ జువెలరీ సేల్స్ ఏజెంట్. పెళ్లి కూతుళ్లకు నగలు అప్పుగా ఇస్తాడు. పెళ్లికి వచ్చిన బంధువులు, ఆహ్వానితులు చదివింపులు ఇస్తారు కదా! కొంత మంది బహుమతులు ఇస్తే మరి కొందరు డబ్బులను చదివిస్తారు. చదివింపుల్లో వచ్చిన డబ్బులలో తనకు రావాల్సిన లెక్కలు తీసుకుని అజేష్ వెళతాడు.
ఒక పెళ్లిలో అదే విధంగా పెళ్లి కుమార్తెకు నగలు అప్పు ఇస్తాడు. పాతిక సవర్ల బంగారం ఇస్తే 13 సవర్లకు సరిపడ డబ్బు మాత్రమే వస్తుంది. మిగతా డబ్బు అడిగితే ఇవ్వకుండా అత్తారింటికి వెళ్లిపోతుంది పెళ్లి కూతురు. అక్కడికి వెళ్లి తనకు రావాల్సిన డబ్బులను అజేష్ తీసుకోగలిగాడా? లేదా? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? అనేది మిగతా సినిమా.
Also Read: కయాదు లోహర్ మాలీవుడ్ రొమాంటిక్ కామెడీ... రెండు ఓటీటీల్లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్
ഈ പൊൻമാൻ തിളങ്ങും!
— JioHotstar Malayalam (@JioHotstarMal) March 7, 2025
Ponman will be streaming from March 14 on JioHotstar!@jose_lijomol @SajinGopu @Films_AV#Ponman #PonmanOnHotstar #JioHotstar #JioHotstarMalayalam #BasilJoseph #Comedy #Drama #Family #MalayalamMovie pic.twitter.com/aiooLmfdO0
తెలుగులో బసిల్ జోసెఫ్ సినిమాలకు డిమాండ్!
బసిల్ జోసెఫ్ సినిమాలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది. ఆయన సినిమాలు ఓటీటీ వేదికల్లో ఎప్పుడు రిలీజ్ అవుతాయా? అని చూసే టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఉన్నారు. 'జయ జయ జయ జయహే' సినిమా ఎఫెక్ట్ ఆ రేంజులో ఉంది మరి. ఇక రీసెంట్ రిలీజ్ 'సూక్ష్మ దర్శిని' గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా నచ్చిన ప్రేక్షకులు కొంత మంది ఉంటే... 'సూక్ష్మ దర్శిని' చూసి తన భార్యను హత్య చేశానని ఒక హంతకుడు చెప్పడం మరింత చర్చకు దారి తీసింది. అందువల్ల అతని సినిమాలకు అంటే ఇప్పుడు మరింత డిమాండ్ ఏర్పడింది. 'పొన్ మాన్' కోసం కూడా జనాలు ఎదురు చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మలయాళంలో సుమారు 10 కోట్ల వరకు కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.





















