Sambaraala Yetigattu: 'సంబరాల ఏటిగట్టు' నుంచి అదిరిపోయే అప్డేట్... 1000 మంది డ్యాన్సర్లతో విజువల్ ఫీస్ట్ సాంగ్ షూటింగ్
Sambaraala Yetigattu : సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న 'సంబరాల ఏటిగట్టు' నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. 1000 మంది డ్యాన్సర్లతో విజువల్ ఫీస్ట్ గా మేకర్స్ ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నట్టు సమాచారం.

సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ త్వరలోనే పాన్ ఇండియా ఎంట్రీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. 'సంబరాల ఏటిగట్టు' మూవీతో ఆయన అన్ని భాషల ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. సాయి తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ రిలీజ్ గురించి మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 'సంబరాల ఏటిగట్టు' నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వచ్చేసింది. అది కూడా ఇందులోని ఒక క్రేజీ సాంగ్ గురించి.
1000 మంది డాన్సర్లతో సాంగ్ షూటింగ్
'సంబరాల ఏటిగట్టు' మూవీ నుంచి ఇప్పటికే 'కార్నేష్' అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూవీలో సరికొత్త ట్రాన్స్ఫర్మేషన్ తో ఆకట్టుకుంటున్నాడు సాయి తేజ్. ఇందులో ఆయన సిక్స్ ప్యాక్ లుక్ లో దర్శనమిచ్చి మెగా అభిమానులలో మరింత జోష్ ని పెంచారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగా తాజా షెడ్యూల్ లో, భారీ బడ్జెట్ తో ప్రత్యేకంగా నిర్మించిన ఒక భారీ సెట్ లో, ఏకంగా 1000 మంది డాన్సర్లతో అద్భుతమైన పాటను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. దీనికి దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ పాట తెరపై చూడడానికి విజువల్ ఫీస్ట్ గా ఉండబోతుందని అంటున్నారు. ఇంకేముంది ఈ వార్త మెగా అభిమానులలో 'సంబరాల ఏటిగట్టు' మూవీ రిలీజ్ పై మరింత ఆతృతను పెంచింది.
రిస్కీ స్టంట్స్ తో భారీ యాక్షన్ సీక్వెన్స్
రీసెంట్ గా 'సంబరాల ఏటిగట్టు' మేకర్స్ రిస్కీ స్టంట్స్ తో కూడిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ని కంప్లీట్ చేశారు. ఈ షూటింగ్ షెడ్యూల్లో సాయి తేజ్ రిస్క్ తీసుకుని, స్వయంగా స్టంట్స్ చేశాడని తెలుస్తోంది. ప్రముఖ స్టంట్ మాస్టర్స్ రామ్ - లక్ష్మణ్ అద్భుతమైన ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని కంపోజ్ చేశారని ఇన్సైడ్ వర్గాల సమాచారం. ఇక ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో సాయి తేజ్ కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని, దీన్ని బిగ్ స్క్రీన్స్ పై చూస్తే పూనకాలు రావడం ఖాయమని అంటున్నారు. ఇక ఇప్పుడు యాక్షన్ ను పక్కన పెట్టి, సాంగ్ షూటింగ్ పై ఫోకస్ చేశారు మేకర్స్.
రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ని దాదాపు 165 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీకి వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు.
Also Read: సింగర్ కల్పన కెరీర్‌లో బెస్ట్ తెలుగు సాంగ్స్... 1500 పాటల్లో, తెలుగులో టాప్ 10 లిస్ట్ ఇదిగో
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

