అన్వేషించండి
Mukku Raju Master: రేవంత్ రెడ్డికి నారాయణమూర్తి రిక్వెస్ట్... చిత్రపురిలో సినీ కార్మికులకు ఇళ్ళు కట్టివ్వాలి... ఆర్ నారాయణ మూర్తి
ముక్కు రాజు మాస్టర్ వేసిన పునాది చాలా గొప్పదని దర్శక నిర్మాత, హీరో ఆర్. నారాయణ మూర్తి అన్నారు. టీఎఫ్‌టీడీడీఏ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ఆయన చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగింది.
ముక్కురాజు మాస్టర్ వేసిన పునాది చాలా గొప్పదన్న ఆర్ నారాయణ మూర్తి... ఆయన లేకపోతే ఫిల్మ్ ఫెడరేషనే లేదన్న తమ్మారెడ్డి భరద్వాజ
1/4

తెలుగు చిత్రసీమలో, ముఖ్యంగా డ్యాన్సర్లలో సాయిరాజ్ రాజంరాజు తెలియని వారు ఉండరు. ముక్కురాజు మాస్టర్ (Mukku Raju Master)గా ఆయన పాపులర్. ఆయన తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) వ్యవస్థాపక అధ్యక్షుడు. డ్యాన్సర్స్ అసోసియేషన్ స్థాపించి 35 ఏళ్ళు అయిన నేపథ్యంలో ప్రముఖ దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి చేతుల మీదుగా ముక్కు రాజు మాస్టర్ విగ్రహావిష్కరణ జరిగింది.
2/4

ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ... ''TFTDDA అసోసియేషన్ ఇంత గొప్పగా ఉందంటే ముక్కు రాజు మాస్టర్. కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ఆయన నంబర్ వన్. ఎంతో గొప్పతనం ఉన్న మంచి మనిషి. 24 శాఖల ఫెడరేషన్ ఏర్పాటు కోసం 1991లో ముక్కు రాజు మాస్టర్ వేసిన పునాది డ్యాన్సర్స్ అసోసియేషన్ స్థాపన. ఆ తర్వాత ఒక్కో యూనియన్ వచ్చింది. నా ప్రతి సినిమాలోనూ ముక్కు రాజు మాస్టర్ పని చేశారు. చిత్ర పరిశ్రమలోని కార్మికులందరికీ చిత్రపురి కాలనీలో పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా'' అని చెప్పారు.
Published at : 24 Apr 2025 01:29 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















