Nani New Movie Title : 'సరిపోదా శనివారం' అంటున్న నాని - వివేక్ ఆత్రేయ!
Nani Vivek Athreya Movie : నాని హీరోగా వివేక్ ఆత్రేయ ఓ సినిమాకు దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు టైటిల్ ఖరారు చేసినట్లు టాక్.

Nani Vivek Athreya movie titled Saripodha Shanivaaram : నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఓ కొత్త సినిమా చేయడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ వీళ్ళిద్దరూ 'అంటే సుందరానికి' సినిమా చేశారు. బాక్సాఫీస్ బరిలో ఆ సినిమాకు ఆశించిన వసూళ్లు రాలేదు. కానీ, ప్రేక్షకులతో పాటు విమర్శకుల మనసులు గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి హీరో, దర్శకుడు కలిసి సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది.
సరిపోదా శనివారం...
సినిమా టైటిల్ ఇదేనని!
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించనున్న సినిమాకు సరిపోదా శనివారం (Saripodha Sanivaaram Movie) టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికి'... ఇప్పటి వరకు వివేక్ ఆత్రేయ తీసిన ప్రతి సినిమాకు వెరైటీ టైటిల్ పెట్టారు. ఈ సినిమాకు కూడా ఆ విధంగా ముందుకు వెళుతున్నారు.
'సరిపోదా శనివారం' సినిమాను శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 'ఓజీ'కి కూడా ఆయనే నిర్మాత. ఇక, 'సరిపోదా శనివారం' విషయానికి వస్తే... ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంకా అరుల్ మోహన్ ఎంపిక అయ్యారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దానయ్య నిర్మిస్తున్న 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' సినిమాలో కూడా ఆమె హీరోయిన్. ఓ నిర్మాణ సంస్థలో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు అన్నమాట.
Also Read : టైగర్ నాగేశ్వరరావు రివ్యూ : రవితేజ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా? లేదా? సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి?
నాని సినిమాల విషయానికి వస్తే... ఆయన హీరోగా నటించిన 'హాయ్ నాన్న' సినిమా డిసెంబర్ 7న విడుదల కానుంది. తొలుత ఆ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయాలని భావించినా... ప్రభాస్ 'సలార్' వస్తుండటంతో ముందుకు జరిపారు.
Also Read : 'లియో' రివ్యూ : LCUలో విజయ్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేజిక్ వర్కవుట్ అవుతుందా? లేదా?
ప్రియాంకా అరుల్ మోహన్ విషయానికి వస్తే... పవన్ కళ్యాణ్ 'ఓజీ'తో పాటు తమిళ స్టార్ ధనుష్ సరసన 'కెప్టెన్ మిల్లర్' కూడా చేస్తున్నారు. ఆ సినిమా డిసెంబర్ 15న విడుదల కానుంది. దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించే సినిమాలో కూడా కథానాయికగా ఆమెను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ టాక్.
'సరిపోదా శనివారం' చిత్రానికి వివేక్ సాగర్ సంగీత దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. నాని, వివేక్ ఆత్రేయ కలయికలో వచ్చిన 'అంటే సుందరానికీ' సినిమాతో పాటు అంతకు ముందు వివేక్ ఆత్రేయ తీసిన 'బ్రోచేవారెవరురా' సినిమాకు కూడా వివేక్ సాగర్ వర్క్ చేశారు. అయితే... మొదట 'సరిపోదా శనివారం' సినిమాకు ముందు ఏఆర్ రెహమాన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే... చివరకు, వివేక్ సాగర్ వైపు మొగ్గు చూపారట.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

