అన్వేషించండి

Natasha Doshi: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ‘జై సింహా’ హీరోయిన్ - నెలరోజుల తర్వాత ఫోటోలు షేర్ చేసిన నటి

Natasha Doshi: బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘జై సింహా’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నటాషా దోషి. తాజాగా ఈ భామ సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని నెలరోజుల తర్వాత ఫోటోలను షేర్ చేసింది.

Jai Simha Heroine Natasha Doshi Marriage: గత రెండేళ్లలో సినీ పరిశ్రమలో పెళ్లి చేసుకుంటున్న సెలబ్రిటీల సంఖ్య ఎక్కువయిపోతోంది. అందరూ ఘనంగా తమ తమ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత వారే స్వయంగా ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగామరో హీరోయిన్ కూడా పెళ్లి పీటలెక్కింది. కానీ గత నెలలో అంటే జనవరిలో తన పెళ్లి జరిగితే.. నెలరోజుల తర్వాత ఇప్పుడు తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చింది ఈ భామ. తను మరెవరో కాదు ‘జై సింహా’ ఫేమ్ నటాషా దోశి. బిజినెస్ మ్యాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ.. షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

గతేడాది ఎంగేజ్‌మెంట్..

బాలకృష్ణలాంటి హీరో సరసన ‘జై సింహా’ సినిమాతో డెబ్యూ చేసినా కూడా నటాషా దోశీకి లక్ కలిసి రాలేదు. మాలీవుడ్ లాగానే టాలీవుడ్‌లో కూడా తనకు అవకాశాలు కరువయ్యాయి. చివరిగా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఎంత మంచివాడవురా’ సినిమాలో ఐటెమ్ గర్ల్‌గా కనిపించింది. ఆ తర్వాత వెండితెరపై కనుమరుగమయిపోయింది ఈ భామ. తాజాగా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. మనన్ షా అనే బిజినెస్ మ్యాన్‌ను నటాషా ప్రేమించి పెళ్లి చేసుకుంది. గతేడాది జులైలో వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇక 2024 జనవరి 31న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని తన సోషల్ మీడియా పోస్టుల్లో బయటపెట్టింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Natasha Doshi (@natashadoshi)

మిస్ టాలెంటెడ్..

ముంబాయ్‌లో పుట్టి పెరిగిన నటాషా దోశీ.. యాక్టింగ్ కెరీర్‌ను మాత్రం కేరళ నుండే మొదలుపెట్టింది. చిన్నప్పటి నుండి తనకు యాక్టింగ్, డ్యాన్స్ అంటే ఇష్టం ఉండడంతో క్లాసికల్ డ్యాన్స్‌లో ట్రైనింగ్ కూడా తీసుకుంది. అంతే కాకుండా 2010లో తనకు మిస్ కేరళ పోటీల్లో మిస్ టాలెంటెడ్ అని కిరీటాన్ని కూడా దక్కించుకుంది. అలా మెల్లగా సినిమాల్లో తన ప్రయాణం మొదలయ్యింది. హీరోయిన్‌గా కూడా తను ముందుగా మలయాళ చిత్రాలతోనే ప్రేక్షకులను పలకరించింది. 2010లో తనకు మిస్ టాలెంటెడ్‌గా కిరీటం దక్కిన తర్వాత మలయాళ సినిమా ఆఫర్లను తనను వెతుక్కుంటూ వచ్చాయి. అందుకే 2012లో ఒకటి కాదు.. ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.

బాలయ్య సరసన..

ముందుగా 2012లో ‘మాంత్రికన్’ అనే మలయాళ సినిమాలో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది నటాషా దోశీ. అదే ఏడాది ‘హైడ్ ఎన్ సీక్’తో మరోసారి ఆకట్టుకుంది. కానీ ఈ సినిమాలు తను ఆశించనంత విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి. అదే సమయంలో సీనియర్ హీరో బాలకృష్ణ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రమే ‘జై సింహా’. ఇందులో నయనతార, హరిప్రియలతో పాటు నటాషా కూడా మూడో హీరోయిన్‌గా నటించింది. దీంతో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కోతల రాయుడు’ అనే చిత్రంలో కూడా తనకు అవాకశం వచ్చింది. కానీ సినిమాలు తనకు వర్కవుట్ అవ్వలేదు. పర్సనల్ లైఫ్‌లో అయినా తను హ్యాపీగా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Also Read: అంబానీ ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌లో రామ్‌ చరణ్‌కు అవమానం - షారుక్‌పై మెగా ఫ్యాన్స్‌ ఫైర్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLC Election Results 2025: కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
ICC Champions Trophy Final Ind Vs NZ: న్యూజిలాండ్ వ‌ర్సెస్ ఇండియా.. టోర్నీ ఫైన‌ల్ ఖ‌రారు.. సెమీస్ లో కివీస్ ఘ‌న విజ‌యం.. మ‌ళ్లీ చోక్ చేసిన సౌతాఫ్రికా
న్యూజిలాండ్ వ‌ర్సెస్ ఇండియా.. టోర్నీ ఫైన‌ల్ ఖ‌రారు.. సెమీస్ లో కివీస్ ఘ‌న విజ‌యం.. మ‌ళ్లీ చోక్ చేసిన సౌతాఫ్రికా
MLC BJP Won: పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్
పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్
YS Vivka Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం -  భద్రత కల్పించిన సాక్షి మృతి !
వివేకా హత్య కేసులో కీలక పరిణామం - భద్రత కల్పించిన సాక్షి మృతి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs NZ Semi Final 2 | Champions Trophy ఫైనల్లో భారత్ ను ఢీకొట్టేది కివీస్ | ABP DesamChampions Trophy | 97 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇండియా | ABP DesamSrisailam Elevated Corridor Project Details | నల్లమల్ల అడవిలో ఎలివేటెడ్ కారిడార్‌ | ABP DesamAP Speaker Ayyannapathrudu on YS Jagan Letter | స్పీకర్ ను కించపరిచేలా జగన్ లేఖలున్నాయన్న అయ్యన్న | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLC Election Results 2025: కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
ICC Champions Trophy Final Ind Vs NZ: న్యూజిలాండ్ వ‌ర్సెస్ ఇండియా.. టోర్నీ ఫైన‌ల్ ఖ‌రారు.. సెమీస్ లో కివీస్ ఘ‌న విజ‌యం.. మ‌ళ్లీ చోక్ చేసిన సౌతాఫ్రికా
న్యూజిలాండ్ వ‌ర్సెస్ ఇండియా.. టోర్నీ ఫైన‌ల్ ఖ‌రారు.. సెమీస్ లో కివీస్ ఘ‌న విజ‌యం.. మ‌ళ్లీ చోక్ చేసిన సౌతాఫ్రికా
MLC BJP Won: పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్
పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్
YS Vivka Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం -  భద్రత కల్పించిన సాక్షి మృతి !
వివేకా హత్య కేసులో కీలక పరిణామం - భద్రత కల్పించిన సాక్షి మృతి !
Congress Mallanna: కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిన మల్లన్న - వివరణ ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్
కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిన మల్లన్న - వివరణ ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్
Nara Lokesh: అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్ రెడ్డి - నారా లోకేష్ తీవ్ర విమర్శలు
అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్ రెడ్డి - నారా లోకేష్ తీవ్ర విమర్శలు
Singer Kalpana Daughter: మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె
మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె
Anantapur News: బీజేపీ నేత కబ్జాలపై కదిలిన ప్రభుత్వం - ఆదినారాయణ కబ్జాలపై సిట్ వేయాలని బాధితుల డిమాండ్
బీజేపీ నేత కబ్జాలపై కదిలిన ప్రభుత్వం - ఆదినారాయణ కబ్జాలపై సిట్ వేయాలని బాధితుల డిమాండ్
Embed widget