By: ABP Desam | Updated at : 19 Feb 2023 11:43 AM (IST)
శివ రాజ్ కుమార్, రామ్ చరణ్
కన్నడ దర్శకుడితో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నారా? 'మఫ్టీ' లాంటి కమర్షియల్ హిట్ తీసిన నర్తన్ (Narthan) తో 'ఆర్ఆర్ఆర్' హీరో సినిమా ఓకే అయ్యిందా? వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగిన మాట అయితే వాస్తవమే. కానీ, రామ్ చరణ్ సినిమా కంటే ముందు మరొక సినిమాను దర్శకుడు ఓకే చేశారు.
ఎవరీ నర్తన్?
కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు, సూపర్ స్టార్ శివన్న (Shiva Rajkumar) కథానాయకుడిగా నటించిన 'మఫ్టీ' సినిమా (Mufti Movie) తో నర్తన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అంతకు ముందు ఓ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా రాశారు. అయితే, 'మఫ్టీ' సినిమా ఆయన మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. 'కెజియఫ్' ఫేమ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ దగ్గర నర్తన్ పని చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ - నర్తన్ సినిమా విషయానికి వస్తే...
రామ్ చరణ్ కథానాయకుడిగా సినిమా చేయాలని నర్తన్ ఆశ పడ్డారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి కథ కూడా వినిపించారు. హీరో, దర్శకుడి మధ్య కొన్ని రోజులు చర్చలు కూడా వినిపించాయి. అయితే... ఇప్పుడు ఆ సినిమా కంటే ముందు మరో సినిమా అనౌన్స్ చేశారు నర్తన్.
'మఫ్టీ'కి ప్రీక్వెల్...
శివ రాజ్ కుమార్ కథానాయకుడిగా 'మఫ్టీ'కి ప్రీక్వెల్ (Mufti Prequel) చేయడానికి నర్తన్ సిద్ధం అయ్యారు. ఈ మహా శివరాత్రి సందర్భంగా ఆ సినిమాను అనౌన్స్ చేశారు. టైటిల్ 'భైరతి రణగల్'. దాంతో రామ్ చరణ్ సినిమా ఇప్పట్లో ఉండే అవకాశం లేదనే మాట వినబడుతోంది.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఆ సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. దాని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆ రెండు అయిన తర్వాత నర్తన్ సినిమా ఉండొచ్చు. మరోవైపు శివ రాజ్ కుమార్ కూడా బిజీగా ఉన్నారు. అయితే... సినిమా పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకోరు. త్వరత్వరగా సినిమాలు పూర్తి చేస్తారు.
మామా అల్లుళ్ళతో శివన్న సినిమాలు
ఇప్పడు శివ రాజ్ కుమార్ కేవలం కన్నడ సినిమాలు మాత్రమే చేయడం లేదు. పాన్ ఇండియా సినిమాల మీద ఆయన కాన్సంట్రేషన్ చేశారు. ఇతర భాషల్లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు తమిళ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఆ రెండూ ఇతర భాషల్లో విడుదల కానున్నవే. పాన్ ఇండియా సినిమాలే. అందులో ఒకటి సూపర్ రజనీకాంత్ 'జైలర్' అయితే... మరొకటి ఆయన అల్లుడు ధనుష్ 'కెప్టెన్ మిల్లర్'.
Also Read : 'శ్రీదేవి శోభన్ బాబు' రివ్యూ : చిరంజీవి కుమార్తె నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
ఇటీవల శివ రాజ్ కుమార్ 125వ సినిమా 'వేద' తెలుగులోనూ విడుదల అయ్యింది. ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నట సింహం నందమూరి బాలకృష్ణతో పూర్తి స్థాయి పాత్రలో సినిమా చేయాలని ఉందని ఆయన తన మనసులో మాటను బయట పెట్టారు.
Also Read : తారకరత్న వారసులు ఎంత మందికి తెలుసు? చిన్న కుమార్తె, కొడుకు గురించి...
Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్
Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం
Ravanasura – Sushanth: సుశాంత్‌కు ‘రావణాసుర’ టీమ్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, విలన్ పాత్రలో అదుర్స్ అనిపించాడుగా!
Aishwaryaa Rajinikanth: రజనీకాంత్ కుమార్తె ఇంట్లో భారీ చోరీ, పోలీసులకు ఫిర్యాదు
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !
Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?