Bigg Boss Telugu Season 8 Episode 42 Review : అవినాష్ బండారం వీడియోతో బయటపెట్టిన నాగ్, నబిల్ ఫాలింగ్ స్టార్... డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు
బిగ్ బాస్ 8 తెలుగు ఎపిసోడ్ 42 లో నాగార్జున ఒక్కొకరి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ కంటెస్టెంట్స్ చేసిన తప్పులను ఎత్తి చూపారు. మరి నేటి ఎపిసోడ్ లోని హైలెట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

బిగ్ బాస్ 8 తెలుగు డే 42 వీకెండ్ ఎపిసోడ్ ఎప్పటిలాగే ఫుల్ జోష్ తో మొదలైంది. నాగార్జున ఎంట్రీ తర్వాత హౌస్ మేట్స్ అందరినీ పలకరించారు. ముందుగా విష్ణుప్రియ, ప్రీత్వి మాల్దీవుల డిస్కషన్ గురించి మాట్లాడారు. ఆ తరువాత బీబీ టాస్క్ లో గులాబ్ జామూన్ ను దొంగతనంగా తిన్న అవినాష్, టేస్టీ తేజాలకు గులాబ్ జామూన్ లు ఇచ్చి తినమన్నారు. వీడియోతో ద్వారా వీరిద్దరూ కలిసి గులాబ్ జామూన్ ఎలా తిన్నారో చూపించారు. 'హోటల్ స్టాఫ్ కు డబ్బులు ఇవ్వకుండా గులాబ్ జామున్ తిన్నారు. సీత దగ్గర డబ్బులు లాగేసుకున్నారు. డబ్బులు ఇస్తే ఓజీ టీం వాళ్ళు గెలిచేవారు కదా?' అంటూ నబిల్ ను, అలాగే రాయల్స్ క్లాన్ ను ప్రశ్నించారు నాగ్. 'గిల్టీ ట్రిగ్గర్ కావడంతో తిరిగి ఇచ్చేశాను డబ్బులు' అని సీత చెప్పగా, 'ఎథికల్ గా అవతలివాళ్లు ఆడనప్పుడు, మీరు ఆడి ఏం లాభం? నువ్వు రాయల్స్ వచ్చాక ఆట మర్చిపోయావా, ఫాలింగ్ స్టార్ ఇస్తాను. నువ్వు సరిగ్గా ఆడలేదు' అంటూ నాగ్ నబిల్ కు మొహం మీద చెప్పేశాడు. 'గౌతమ్ కి, నీకు మధ్య ఇష్యూ ఉంది మాట్లాడావా? అతి ముఖ్యమైన ఉప్పును మర్చిపోయావు' అంటూ ఈ వారం నబిల్ చేసిన తప్పులను ఎత్తి చూపారు నాగ్. మెహబూబ్ మెగా చీఫ్ అయినందుకు రైసింగ్ స్టార్ అని చెప్పారు. 'నీ నుంచి అరుంధతి వదలా అనే పర్ఫామెన్స్ కావాలి.. ఏడుస్తూ చెప్పాలని అడగ్గా చేశాడు. అలాగే రోహిణి, అవినాష్ మధ్య ఈ ఫన్నీ పర్ఫామెన్స్ నడిచింది. అలాగే మణికంఠను బచ్చాగాడు అన్నందుకు ప్రశ్నించాడు. అలాగే రోహిణి, విష్ణు ప్రియ మధ్య జరిగిన గొడవలను కూడా క్లియర్ చేశారు.అలాగే 'ఎప్పుడో జరిగిన ట్రోలింగ్ గురించి ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావ్ ?' అంటూ గౌతమ్ ను గట్టిగానే మందలించారు బిగ్ బాస్.ఇక గంగవ్వ తనను నామినేట్ చేశారని కంప్లయింట్ చేయగా, నువ్వు ఎక్కడికీ కదలవు అంటూ నాగార్జున హామీ ఇచ్చారు.
రైజింగ్ స్టార్స్.. ఫాలింగ్ స్టార్స్
ఈ వారం కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ ను బట్టి ఎవరు రైజింగ్ స్టార్ ఎవరు ఫాలింగ్ స్టార్ అనే విషయాన్ని నాగ్ వెల్లడించారు. రైజింగ్ స్టార్స్ లిస్ట్ లో అవినాష్, రోహిణి, మెహబూబ్, మణికంఠ, హరితేజ, గంగవ్వ, యశ్మీ గౌడ, నయని పావని ఉన్నారు. ఇక ఫాలింగ్ స్టార్స్ లిస్ట్ లో టేస్టీ తేజా, నబిల్, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, సీత, గౌతమ్ ఉన్నారు. ప్రేరణ మాత్రం మధ్యలో ఉంది.
డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు...
ఈ వారం డేంజర్ జోన్ లో ముగ్గురు ఉన్నట్టుగా ఎపిసోడ్ చివర్లో చెప్పారు నాగార్జున. ముందుగా అందరూ లాగేజ్ బ్యాగ్ పట్టుకుని యాక్షన్ జోన్లోకి రమ్మని చెప్పిన నాగ్, ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారో రీజన్ తెలియజేస్తూ, ఒక్కొక్కరుగా కంటెస్టెంట్స్ సూట్ కేస్ ని అక్కడ పెట్టి రీజన్ చెప్పాలని ఆదేశించారు. ఇక చివరిగా గౌతమ్, టేస్టీ తేజాతో పాటు మరొకరి సూట్ కేసులు అక్కడ పెట్టి వెళ్లిపోవాలని చెప్పారు. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

