Ratan TATA Movie: రతన్ టాటా చేసిన ఏకైక సినిమా... ఆయన మళ్లీ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
ప్రముఖ దివంగత భారతీయ బిజినెస్ మ్యాన్ రతన్ టాటా ఒక సినిమాను కూడా తీశారన్న విషయం తెలుసా? ఆ సినిమా ఏంటో చూసేద్దాం పదండి.
సక్సెస్ ఫుల్ బిజినెస్ టైకూన్ రతన్ టాటా నేడు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నో రంగాల్లో అడుగు పెట్టి సక్సెస్ అయిన రతన్ టాటా సినిమా రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చాడనే విషయం చాలామంది మూవీ లవర్స్ కి తెలియదని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటి తరం ప్రేక్షకులకు ఈ విషయం గురించి ఏమాత్రం ఐడియా లేదు. అయితే ఒక్క సినిమాతోనే ఆయన సినిమా రంగంలో తన అడుగులకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆయన చేసిన సినిమా ఏంటి? ఎందుకు ఆ తర్వాత సినిమాల జోలికి వెళ్లలేదు? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
రతన్ టాటా చేసిన ఏకైక సినిమా
రతన్ టాటా బాలీవుడ్ లో ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. కానీ ఆయన చేసిన ఆ ఏకైక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. రతన్ టాటా ప్రొడ్యూస్ చేసిన ఆ సినిమా మరేదో కాదు 2004లో రిలీజ్ అయిన 'ఏత్ బార్'. బాలీవుడ్ నిర్మాత జితిన్ కుమార్ తో కలిసి రతన్ టాటా 2004లో ఈ సినిమాను నిర్మించారు. ఇక ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు మెయిన్ లీడ్స్ గా నటించారు. హిందీ దర్శకుడు విక్రమ్ భట్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 1996లో వచ్చిన హాలీవుడ్ సినిమా 'ఫియర్' స్పూర్తితో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కోసం రతన్ టాటా దాదాపు 9 కోట్ల 50 లక్షలు ఖర్చుపెట్టారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 7. 50 కోట్లను మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. అప్పట్లో ఇంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా వల్ల రతన్ టాటా భారీగా నష్టపోక తప్పలేదు.
Read Also : Vettaiyan OTT: ‘వేట్టయాన్’ ఓటీటీ రైట్స్ ఆ సంస్థ చేతికే... స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
సినిమాలకు దూరం అవ్వడానికి ఇదే కారణం
ఇక మొదటి సినిమాతోనే ఊహించని విధంగా ఘోర పరాజయం ఎదుర్కోవడంతో రతన్ టాటా సినిమా ఇండస్ట్రీలో కూడా తనదైన ముద్ర వేయాలని అప్పటిదాకా ఉన్న ఆలోచనను విరమించుకున్నారు. ఆయన తీసిన ఏకైక సినిమా డిజాస్టర్ కావడంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి మళ్ళీ ఇటువైపు తిరిగి చూడలేదు. కానీ ఆ సినిమా ప్లాప్ తర్వాత చాలామంది దర్శక నిర్మాతలు మంచి కథతో రతన్ టాటాను సంప్రదించినా ఆయన ఇటువైపు మొగ్గు చూపలేదు. ఒకవేళ ఆ సినిమా కనుక సక్సెస్ అయ్యి ఉంటే రతన్ టాటా సినిమా ఇండస్ట్రీలో కూడా నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకునే వారేమో. అయితేనేం వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషి ఎంతో మందికి ఆదర్శనీయమని చెప్పాలి. ఇక తాజాగా రతన్ టాటా కన్నుమూయడంతో ఈ వార్త మరోసారి తెరపైకి వచ్చింది. ఇదిలా ఉండగా రతన్ టాటా ఇక లేరన్న విషయం తెలిసిన వెంటనే చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబు తదితరులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు.
Read Also: 'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?