Vettaiyan OTT: ‘వేట్టయాన్’ ఓటీటీ రైట్స్ ఆ సంస్థ చేతికే... స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Vettaiyan OTT Platform: రజనీకాంత్, టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట్టయాన్’ థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది.
Rajinikanth's Vettaiyan OTT Rights: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన తాజా ఇన్వెస్టిగేషన్ యాక్షన్ మూవీ ‘వేట్టయాన్’ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా కానుకగా ఇవాళ తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే స్పెషల్ షోలు మొదలయ్యాయి. తొలి షో నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ లభించింది. ఆయన గత సినిమాలతో పోల్చితే తెలుగులో ఈ మూవీకి అనుకున్న స్థాయిలో ఆదరణ కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మరీ అంతగా లేవు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఈ సినిమా ‘టైటిల్’ వివాదం తలెత్తడంతో మేకర్స్ కు ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. మరోవైపు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని మరికొంత మంది ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ చేతికి ఓటీటీ రైట్స్
టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో, రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రకటన నాటి నుంచే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ రూ. 140 కోట్లతో తెరకెక్కించింది. సూపర్ స్టార్ కెరీర్ లో 170వ చిత్రంగా రూపొందిన ఈ మూవీపై ట్రైలర్ క్యూరియాసిటీ పెంచింది. ప్రస్తుతం థియేటర్లలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో ‘వేట్టయాన్’ మూవీకి సంబంధించి ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్ రైట్స్ ను సన్ టీవీ ఏకంగా రూ. 65 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ. 100 కోట్లతో ‘వేట్టయాన్’ మూవీ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఎక్కువ కాలం థియేటర్లలో ఆడే అవకాశం కనిపించడం లేదు. ఈ మూవీ సుమారు 3 నుంచి 4 వారాల్లో ఓటీటీలోకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
‘వేట్టయాన్’లో పలువురు స్టార్ హీరోలు
‘వేట్టయాన్’ మూవీలో పలు సినీ పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ హీరో రానా, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ తో పాటు మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్, జీఎం సుందర్, అభిరామి, రోహిణి, రావు రమేష్, రమేష్ తిలక్, రక్షణ చక్కటి నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. తమ మార్క్ బీజీఎంతో సినిమాకు ప్రాణం పోశారు.
Read Also: 'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?