రతన్ టాటా మృతిపై మాజీ ప్రేయసి ట్వీట్ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం పట్ల ఆయన మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి సిమి గరేవాల్ సంతాపం తెలిపారు 'ఇక నువ్వు లేవని అంటున్నారు. ఇది భరించ లేనిది. వీడ్కోలు నేస్తమా' అని ఆమె ట్వీట్ చేశారు రతన్ టాటాతో తాను డేటింగ్ చేశానని..కొన్నేళ్ల తర్వాత విడిపోవాల్సి వచ్చిందని ఆమె 2011లో ఓ ఇంటర్యూలో చెప్పారు హాలీవుడ్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సిమి గరేవాల్..ఆ తర్వాత బాలీవుడ్, బెంగాలీలో పలు మూవీస్ లో నటించారు రతన్ టాటా ఆర్కిటెక్చర్లో గ్రాడ్యూయేషన్ పూర్తిచేసి లాస్ ఏంజెల్స్‌లో రెండేళ్లు పనిచేశారు. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు అ అమ్మాయిని పెళ్లిచేసుకోవాలి అనుకున్న సమయంలో..తన బామ్మకి ఆరోగ్యం బాగాలేక ఇండియా రావాల్సి వచ్చింది. 1962లో ఇండో-చైనా యుద్ధం కారణంగా అమ్మాయి తల్లిదండ్రులు భారత్ పంపేందుకు అంగీకరించలేదు. బ్రేకప్ తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు కానీ.. పనుల్లో బిజీ అయి వ్యక్తిగత జీవితంపై ఫోకస్ చేయలేకపోయారు.