28 డిసెంబర్ 1937న బొంబాయిలో రతన్ టాటా జన్మించారు రతన్ టాటా ప్రాథమిక విద్య ముంబైలోని క్యాంపియన్ స్కూల్‌లో సాగింది. క్యాంపియన్ స్కూల్‌లో 8వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్, సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్‌లో చదువుకున్నారు అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (B.Arch) డిగ్రీని పొందారు. డబ్బులు సరిపోక వివిధ పనులు చేస్తూ అంట్లు కూడా తోమారు. 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ చేశారు. 1962లో మొదట టాటా స్టీల్స్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్ వద్ద పని చేశారు. టాటా స్టీల్ సంస్థలోనే తొమ్మిదేళ్లు రకరకాల ఉద్యోగాల్లో రాటుదేలారు. నెల్కో, ఎంప్రెస్ మిల్స్ చేదు అనుభవాన్ని మిగిల్చాయి 1991లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.