టాటా..అదొక సంస్థ కాదు ఎమోషన్!
టాటా అంటే అదొక సంస్థ కాదు దేశం మొత్తం అదొక ఎమోషన్ అనేంతలా వ్యాపార సామ్రాజ్యాన్ని తీర్చిదిద్దారు రతన్ టాటా
దాతృత్వంతో పెద్ద మనసు చూపించి మరో కర్ణుడు అనిపించుకున్నారు..అందుకే ప్రజల మనసులో చిరంజీవిగా ఉండిపోయారు
30 లిస్టెడ్ కంపెనీలు ఉన్న రతన్ టాటా ఆస్తి 3800 కోట్లు. దేశంలో వ్యాపార దిగ్గజాల ఆస్తులు లక్షల కోట్లలో ఉంటే టాటా సంపాదన ఏడాదికి రెండున్నకోట్లు. అది కూడా టాటా సన్స్‌లో ఉన్న షేర్ల కారణంగా వస్తున్న ఆదాయం
తన జీవిత ప్రయాణంలో రతన్ టాటా దానం చేసిన సొమ్ము..అక్షరాలా 9వేల కోట్ల రూపాయలు. దేశం ఇబ్బందిలో ఉందని తెలిస్తే చాలు ఆయన హృదయం ద్రవిస్తుంది
కొవిడ్ మహమ్మారి దేశం మొత్తాన్ని అతలాకుతలం చేసిన సమయంలో దేవుడిలా ఆదుకున్నారు రతన్ టాటా. ఏ వ్యాపారవేత్త ఊహకు అందని విధంగా 1500 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు
విద్య, ఆరోగ్య వ్యవస్థ బావుంటే దేశానికి అంతకుమించిన సేవ మరొకటి లేదని నిరంతరం చెప్పేవారు..అందుకే సంపాదనపై మాత్రమే కాదు సేవా కార్యక్రమాలకోసం కూడా ఉంతే ఉత్సాహంగా ఉండేవారు
వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్న రతన్ టాటా మొహంలో ఎప్పుడూ టెన్షన్ కనిపించదంటారు సన్నిహితులు. ఆయన లైఫ్ స్టైల్ చూసిన వారు అసలు ఈయన ఆగర్భశ్రీమంతుడేనా అని సందేహపడుతుంటారు..అంత సింపిల్ గా ఉంటుంది ఆయన లైఫ్ స్టైల్.
ఆయనకు భేషజాలు లేవు.. గర్వం అనే మాటే ఆయన దరిచేరదు..సున్నితమైన మనసు.. టాటా కంపెనీలో ల్యాండ్ రోవర్, జాగ్వార్ లాంటి కార్లు తయారైనా కానీ ఆయనకు సెడాన్ లేదా నానో వేసుకుని ఒక్కరే డ్రైవ్ చేసుకుని వెళతారు
దారిలో స్నేహితులు కనిపిస్తే ఆగిపోతారు.. మార్గమధ్యలో కుక్కపిల్లలు కనిపిస్తే కారు ఆపి వాటికి బిస్కెట్లు తినిపించడం ఆయనకు ఎంతో ఇష్టమైన పని.
రతన్ టాటా వ్యాపారం, సేవా, వ్యక్తిత్వం గురించ ఎంత చెప్పుకున్నా తక్కువే..అందుకే ఆయన ఇక లేరు అనే విషయం యావత్ దేశాన్ని కదిలించేస్తోంది