1896లో జంజిబార్ బ్రిటన్ మధ్య కేవలం 40 నిముషాల పాటు యుద్ధం జరిగింది. ప్రపంచంలోనే ఇదే అత్యంత చిన్న యుద్ధం
ఇంగ్లీష్ భాషలో అత్యంత చిన్న వాక్యం I Am. పూర్తి అర్థం ఇస్తూనే కేవలం రెండు పదాలతో ఈ వాక్యం పూర్తవుతుంది.
మన ముక్కుకి కనీసం లక్ష కోట్ల రకాల సెంట్‌లను వాసన చూసి గుర్తించగలిగే సామర్థ్యం ఉంటుందట.
ఒక మేఘం బరువు ఎంతుంటుందో తెలుసా? 10 లక్షల పౌండ్లు.
అమెరికాలోని ఏ రాష్ట్రం పేరులోనూ Q అనే అక్షరం కనిపించదట. ఇది చాలా అరుదైన విషయం.
చీమలు ప్రతి 12 గంటల సమయానికి కేవలం 8 నిముషాలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటాయి.
ఆ మధ్య 9 వేల ఏళ్ల క్రితం నాటి బబుల్‌గమ్‌ని గుర్తించారు. ప్రపంచంలో అత్యంత పాత చూయింగ్ గమ్ ఇదే.
హిప్పోపోటమస్ ఏకంగా ఓ స్పోర్ట్స్ కార్‌ని అమాంతం మింగేయగలదు. అంత పెద్దగా దాని నోరు తెరుచుకుంటుందట.