అనంత్ అంబానీ పెళ్లి జులై 12వ తేదీన చాలా గ్రాండ్‌గా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకల గురించి మాట్లాడుకున్నారు. ఈ పెళ్లి వేడుకల్లో కొత్త జంటకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చారు సెలెబ్రిటీలు. ఇప్పుడిది కూడా హాట్ టాపిక్‌గా మారింది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌కి MS ధోనీ రూ.12 కోట్ల విలువైన ఫిలిప్పీ వాచ్‌లు గిఫ్ట్‌గా ఇచ్చినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఏకంగా ప్రైవేట్ జెట్‌నే గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీని కాస్ట్ రూ. 300 కోట్లు. అనంత్ అంబానీ జంటకి అమితాబ్ బచ్చన్ రూ.30 కోట్ల విలువైన నెక్లెస్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. సల్మాన్ ఖాన్ కూడా కాస్ట్‌లీ గిఫ్ట్ ప్రజెంట్ చేశాడు. రూ.15 కోట్ల బైక్‌ని కానుకగా ఇచ్చాడు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అనంత్ అంబానీకి రూ.60 లక్షల విలువైన గోల్డ్ పెన్ కానుకగా ఇచ్చాడు. అలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంట అనంత్ అంబానీకి రూ.9 కోట్ల విలువైన మెర్సిడెస్ కార్‌ని గిఫ్ట్‌గా ఇచ్చింది.