అనంత్ అంబానీ పెళ్లిలో నీతా అంబానీ ధరించిన డైమండ్ నెక్లెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇది 100 క్యారెట్‌ల ఎల్లో డైమండ్ నెక్లెస్.
Image Source: Instagram\kantilalchhotalal
ఈ నెక్లెస్‌ని ముంబయిలోని కాంతిలాల్ చోటాలాల్ జ్యువెలరీ 1000 గంటల పాటు శ్రమించి తయారు చేసింది. ఈ నెక్లెస్‌పై 80 క్యారెట్‌ల పచ్చల్ని పొదిగారు.
Image Source: Instagram\kantilalchhotalal
పూర్తిగా మొఘల్ స్టైల్‌లో ఈ నెక్లెస్‌ని డిజైన్ చేశారు. మొత్తం ఐదు వరసల్లో ఉన్న ఈ గొలుసు కళ్లు తిప్పుకోనివ్వని విధంగా మెరిసిపోయింది.
Image Source: Instagram\kantilalchhotalal
చెవి దుద్దులు కూడా ఇంతే స్పెషల్‌గా కనిపించాయి. ఎల్లో డైమండ్‌తో తయారు చేసిన ఈ ఇయర్ రింగ్స్‌పైనా వజ్రాలు పొదగడం వల్ల వాటి అందం పెరిగింది.
Image Source: Instagram\kantilalchhotalal
నీతా అంబానీ ధరించిన డైమండ్స్‌ని కొంత మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు SUV డైమండ్స్ అని పిలుస్తున్నారు. అంత పెద్ద సైజ్‌లో వాటిని తయారు చేశారు.
Image Source: Instagram\ambani_update
పెళ్లికి ముందు రోజు నీతా అంబానీ కట్టుకున్న బెనారస్ శారీ కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ శారీని డిజైన్ చేశారు.
Image Source: Instagram\ambani_update
వారణాసి నగరానికున్న ప్రాధాన్యతని వివరిస్తూ ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో నీతా అంబానీ బెనారస్ చీరలో కనిపించారు.
Image Source: Instagram\ambani_update
దాదాపు 6 నెలల పాటు శ్రమించి ఈ చీరను తయారు చేశారు. ఈ రంగ్‌కట్ శారీలను తయారు చేసే నైపుణ్యం కొంత మంది చేనేత కార్మికులకే ఉంటుంది.