ఏటా జూన్ మూడో ఆదివారం ఫాదర్స్‌డే జరుపుకుంటారు. 2024లో జూన్ 16న ఫాదర్స్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తండ్రిని చూసి పిల్లలు ఎదుగుతారు. వారికి ఉన్న అలవాట్లనే అలవర్చుకుంటారు. అందుకే ప్రతి తండ్రి ఈ 8 అలవాట్లను కలిగి ఉంటే వారి పిల్లలు ప్రయోజకులు అవుతారు. 1. రోజూ నిద్రపోయే టైంలో పిల్లలకు కథలు చెప్పడం అలవాటు చేయండి 2. ఖాళీ సమయంలో పిల్లలతో ఆటలు ఆడాలి. వీలైతే పనులు పక్కన పెట్టి రోజూ గంటైనా వారితో గడపాలి 3. పిల్లల అభిరుచులు, లక్ష్యాలు, స్నేహితులు తెలుసుకొని గౌరవించండి. 4. పిల్లలకు ఆదేశాలు ఇవ్వకుండా సలహాలు మాత్రమే ఇస్తూ సరిదిద్దే ప్రయత్నం చేయండి. 5. మీ పిల్లలకు చదువు తోపాటు వారికి ఉండే హాబీలను తెలుసుకొని వాటిని ప్రోత్సహించండి 6. ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయాలపై వారికి అవగాహన వచ్చేలా చేయాలే తప్ప ఏది ఫాలో అవ్వాలో చెప్పొద్దు 7. పిల్లల పట్ల ఆప్యాయత అనురాగాన్ని కలిగి ఉండండి. వారికి కూడా ఆ లక్షణాలను నేర్పించండి 8. మర్యాద, కృతజ్ఞతా భావం, సాయం చేసే గుణాలను ప్రోత్సహించండి. ఆ గుణాలు అలవడేలా మీరు ఆచరించాలి.