ప్రభుత్వం ఏర్పాటయ్యే ముందు ప్రధాని పదవికి మోదీ ఎందుకు రాజీనామా చేశారు?

ఏ పార్టీ అయినా సరే చట్ట ప్రకారం అధికారంలోకి రావాలంటే మెజార్టీ నిరూపించుకోవాలి.

మెజార్టీ వచ్చిందని నిరూపించుకున్నాకే ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుంది.

ఒకవేళ ఎవరికీ మెజార్టీ రాకుండా హంగ్‌ వస్తే 10 రోజుల్లో బలాన్ని నిరూపించుకోవాలి.

మెజార్టీ వచ్చిన పార్టీ నేతను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ఆహ్వానిస్తారు.

NDA కి 292 సీట్లు రావడం వల్ల అధికారంలోకి రావడానికి లైన్ క్లియర్ అయింది.

తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు NDA నేత మోదీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు.

బలం నిరూపించుకునే ముందు ప్రధాని తన పదవి నుంచి తప్పుకోవాలన్నది నిబంధన.

అందుకే మోదీతో సహా మంత్రులంతా రాజీనామా లేఖల్ని రాష్ట్రపతికి సమర్పించారు.

మెజార్టీ వచ్చిందని డిక్లేర్ చేసిన తరవాతే అధికారికంగా మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టాలి.

జూన్ 9వ తేదీన మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

బీజేపీ, మిత్రపక్ష పార్టీలు ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోదీని ఎంపిక చేశాయి

Thanks for Reading. UP NEXT

మోదీ చేసిన ఆ తప్పే బీజేపీకి మెజార్టీ తగ్గించిందా?

View next story