ఈ ఎన్నికల్లో 400 స్థానాల భారీ లక్ష్యం పెట్టుకున్న బీజేపీ 241 సీట్లతోనే సరిపెట్టుకుంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో సొంతగా 303 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో వెనకబడింది.

యూపీలో స్థానిక సమస్యల్ని పెద్దగా పట్టించుకోకపోవడం సీట్ల సంఖ్యని తగ్గించింది.

ముస్లింలపై మోదీ చేసిన వ్యాఖ్యలూ మైనార్టీ ఓట్లను దూరం చేసి ఆ మేరకు సీట్లు కోల్పోవాల్సి వచ్చింది.

ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండడంతో పాటు బీజేపీ లోపాలను ఎత్తి చూపించడంలో సక్సెస్ అయ్యాయి.

అభివృద్ధిని కాకుండా హిందూ ముస్లిం అజెండానే మోదీ ప్రస్తావించడం కొంత వరకూ బెడిసి కొట్టింది.

OBC లకు బీజేపీ అన్యాయం చేస్తుందన్న ప్రతిపక్షాల విమర్శల్ని మోదీ సరిగ్గా తిప్పికొట్టలేకపోయారు.

పూర్తిగా మోదీ చరిష్మాపైనే ఆధారపడడం క్యాడర్ యాక్టివ్‌గా లేకపోవడం లాంటివీ ఇబ్బంది పెట్టాయి.

400 సీట్లు వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్న రాహుల్ ఆరోపణల్ని ఎదుర్కోవడంలోనూ తడబడింది బీజేపీ.