బిహార్‌లో NDAకి సీట్లు ఎక్కువ రావడంలో సాయం చేసిన నితీశ్‌ కూటమిలో కీలక పాత్ర పోషించనున్నారు.

16 ఎంపీ సీట్లు గెలుచుకున్న తెదేపాకి కూడా కేంద్ర ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కనుంది.

బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న శిందే శివసేన 7 స్థానాల్లో గెలవడం ఆ పార్టీ ప్రాధాన్యతను పెంచింది.

ఇండీ కూటమిలో ఉన్న నితీశ్ ఆ తరవాత NDA కూటమిలోకి రావడం బీజేపీకి కలిసి వచ్చింది.

ఇండీ కూటమి నితీశ్‌కి డిప్యుటీ పీఎం పదవి ఆశ చూపించి తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నించింది.

నితీశ్ కుమార్ మళ్లీ ఇండీ కూటమికి వెళ్లిపోకుండా బీజేపీ ముందుగానే అప్రమత్తమైంది.

ఇప్పటికే NDA కూటమి నేతలతో ప్రధాని మోదీ సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై కీలక చర్చలు జరిపారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కీ ఈ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం అందింది.

కూటమిలోని పార్టీలకు ప్రాధాన్యత ఇస్తూనే కీలక మంత్రిత్వ శాఖలు తమ వద్ద పెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది.

ఎన్డీయే మిత్రపక్షాల నేతలతో భేటీ అనంతరం గ్రూప్ ఫొటో దిగిన ఎన్డీయే టీమ్

Thanks for Reading. UP NEXT

ప్రధాని మోదీ ఎంత శ్రద్ధగా ధ్యానం చేస్తున్నారో చూశారా

View next story