జూన్ 1వ తేదీ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్‌లో మార్పులు రానున్నట్టు కేంద్రం ప్రకటించింది. లైసెన్స్ జారీ ప్రక్రియలోని సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని కొత్త రూల్స్ రూపొందించింది. ఇకపై ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్‌లోనే టెస్ట్ పెట్టి లైసెన్స్ ఇచ్చేలా కొత్త నిబంధన తీసుకొచ్చింది కేంద్రం. లైసెన్స్ ఇవ్వాలంటే డ్రైవింగ్ స్కూల్‌కి ఓ ఎకరం స్థలం ఉండి తీరాలని కేంద్రం కండీషన్ పెట్టింది. ఎక్కువగా డాక్యుమెంటేషన్ అవసరం లేకుండానే లైసెన్స్ పొందేలా రూల్స్ మార్చింది. ట్రైనింగ్‌లో ప్రాక్టికల్ క్లాస్‌లతో పాటు థియరీ క్లాస్‌లు తప్పనిసరి అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ట్రాఫిక్ చలానాలనూ భారీగా పెంచుతూ కీలక మార్పులు చేసింది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2 వేల జరిమానా చెల్లించాల్సిందే. మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రూ.25 వేల ఫైన్ విధించనుంది.