ఇరాన్‌ ఒక్కసారిగా ఇజ్రాయేల్‌పై మిజైల్స్ దాడి చేయడం ఉలిక్కిపడేలా చేసింది. 300 డ్రోన్‌లతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

అసలు ఈ రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో వైరం కొనసాగుతోంది. ఇటీవల జరిగిన ఓ ఘటనతో ఉద్రిక్తతలు పెరిగాయి.

ఇరాన్‌ మద్దతుతో హెజ్బుల్లా ఉగ్రవాదులు గతంలో ఇజ్రాయేల్‌పై చాలా సార్లు దాడి చేశారు. ఇప్పుడు ఇరానే నేరుగా దాడులు చేసింది.

డమాస్కస్‌ ఎంబసీపై ఇజ్రాయేల్ దాడి చేసిందని, అందుకే ప్రతిదాడి చేశామని ఇరాన్ చెబుతోంది.

ఇజ్రాయేల్ మాత్రం ఆ ఎంబసీ దాడితో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది.

అంతకంతకు బదులు తీర్చుకుంటామని చాలా గట్టిగా చెబుతోంది ఇరాన్. దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తోంది.

ఇజ్రాయేల్‌కి అగ్రరాజ్యం మద్దతునిస్తున్నా ఈ గొడవలో తలదూర్చకూడదంటూ ఐక్యరాజ్యసమితి మందలించింది.

ఇరాన్‌ దాడుల తరవాత ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షించింది.

Thanks for Reading. UP NEXT

ఐదేళ్ల పాటు ఉచిత రేషన్, ఇంటింటికీ వంట గ్యాస్ - ఇవి మోదీ గ్యారెంటీలు

View next story