1. జీతం, ఆస్తిపాస్తులు:- మాంత్రికుడు రహస్యాలను దాచుకున్నట్టు గొప్ప వాళ్లు తమ జీత భత్యాలు, ఇతర ఆస్తులను గుట్టుగా ఉంచుకుంటారు.
2. పడకగది రహస్యాలు:- మీ సెక్స్ లైఫ్ గురించి ఎప్పుడూ పక్కవారితో చర్చించకండీ. ఇదో గండికోట రహస్యంలా ఉండిపోవాలి. గొప్ప వాళ్లకు ఇండాల్సిన ప్రధాన లక్షణాల్లో ఇది ఒకటి.
3. ఏం చేసినా కూల్‌గా : గొప్పవాళ్లు తమ గురించి తాము గొప్పగా చెప్పుకోరు. మాటలతో కాకుండా చేతలతోనే గొప్పదనాన్ని తెలియజేస్తుంటారు.
4. నవల లాంటి జీవితం: అవును గొప్పవారి జీవితం థ్రిల్లర్ నవలలా ఉంటుంది. కొన్ని సీక్రెట్‌లు ఎవరికీ తెలియవు. ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతూ ఉంటుంది.
5. సోషల్ మీడియాలో జాగ్రత్త:- ఉన్నత స్థానంలో ఉన్న వాళ్లు సోషల్ మీడియా వాడకంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. లైక్‌లు, షేర్‌ల మోజులో కొట్టుకుపోరు.
6. సెంటిమెంట్ డ్రామాలు: మెచ్యూర్డ్‌గా ఆలోచించేవాళ్ల రిలేషన్స్ బయటకు కనిపించవు. సెంటిమెంట్ డ్రామాలు ఇంటికే పరిమితం చేస్తారు. బహిరంగ పరచరు.
7. సైలెంట్‌గా సాయం:- కుడి చేతితో చేసిన సాయం ఎడమ చేయికి తెలియకుండా జాగ్రత్త పడతారు.
8. మాట జారడం ఉండదు:- మాట జారితే జరిగే పరిణామాలపై వీళ్లకు అవగాహన ఉంటుంది. అందుకే ఇతరుల గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయరు.
9. గుట్టుగా అలవాట్లు:- గొప్ప వాళ్లకి కూడా కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. వాటిని ఎప్పుడూ బహిరంగ పరచరు. నాలుగు గోడల మధ్యే సమాధి చేస్తారు.
10. తొందరపాటు ఉండదు:- దేనికీ తొందరపడరు. అన్ని ఆలోచించుకొని పనులు మొదలు పెడతారు. పరిశీలించకుండా ఏదీ మాట్లాడరు.